Narasapur: నరసాపురం ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..! ఇకపై ఆ 4 రైళ్లూ..!

ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం (Narasapur) స్టేషన్ నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులకు దక్షిణ కోస్తా రైల్వే ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా ఇక్కడి నుంచి బెంగళూరు, అరుణాచలానికి రాకపోకలు సాగించే వారికి ప్రయోజనం కల్పించేలా కీలక నిర్ణయం తీసుుకుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రత్యేక రైళ్లుగా నడుపుతున్న నాలుగు ఎక్స్ ప్రెస్ లను ఇకపై రెగ్యులర్ గా నడిచేలా క్రమబద్ధీకరించింది. ఈ నిర్ణయం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందో అధికారులు వెల్లడించారు.

నరసాపురం నుంచి ఎస్ఎంవీటీ బెంగళూరు స్టేషన్ కు, అలాగే తిరువణ్ణామలై స్టేషన్ కు ప్రయాణికుల డిమాండ్ పెరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని రైల్వేశాఖ పలు ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ఇందులో నాలుగు రైళ్లను ఇప్పుడు రెగ్యులర్ గా మారుస్తున్నారు. ఇందులో నరసాపురం నుంచి తిరువణ్ణామలైకు ప్రతీ బుధవారం నడుపుతున్న ఎక్స్ ప్రెస్ రైలు 1729ను జూలై 1 నుంచి రెగ్యులర్ రైలుగా మార్చారు. అంటే ప్రతీ బుధవారం ఇకపై రెగ్యులర్ గా అందుబాటులో ఉంటుంది.

South Coast Railway Makes 4 Narasapur Trains Permanent due to High Passenger demand

అలాగే తిరువణ్ణామలై నుంచి నరసాపురానికి ప్రతీ గురువారం నడుపుతున్న మరో ఎక్స్ ప్రెస్ రైలు 17292ను కూడా జూలై 2 నుంచి క్రమబద్ధీకరిస్తున్నారు. దీంతో పాటు నరసాపురం నుంచి బెంగళూరుకు ప్రతీ శుక్రవారం నడుపుతున్న ఎక్స్ ప్రెస్ రైలు 17293ను జూలై 3 నుంచి రెగ్యులర్ రైలుగా మారుస్తున్నారు. అలాగే బెంగళూరు నుంచి నరసాపురానికి ప్రతీ శనివారం నడుపుతున్న మరో ఎక్స్ ప్రెస్ రైలు 17294ను కూడా జూలై 4 నుంచి రెగ్యులర్ రైలుగా మారుస్తున్నారు. ఈ నాలుగు రైళ్లకూ ప్రస్తుతం అమల్లో ఉన్న హాల్ట్ లే కొనసాగబోతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+