Narasapur: నరసాపురం రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్-రేపటి నుంచి..!
దక్షిణ కోస్తా రైల్వే పరిధిలోని నరసాపురం (Narasapur) రైల్వే స్టేషన్ నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులకు అలర్ట్. నరసాపూర్ యార్డ్ లో జరుగుతున్న మరమ్మత్తు పనుల కారణంగా ఈ స్టేషన్ నుంచి రాకపోకలు సాగించే పలు రైళ్లపై ప్రభావం పడబోతోంది. నరసాపురం స్టేషన్ నుంచి బయలుదేరే పలు రైళ్లను భీమవరం, పాలకొల్లు నుంచి నడపనున్నారు. అలాగే నరసాపురం వచ్చే రైళ్లను సైతం ఆయా స్టేషన్లకు పరిమితం చేస్తున్నారు. ఏయే రైళ్లకు మార్పులు చేశారో ఇప్పుడు చూద్దాం.
నిడదవోలు నుంచి నరసాపురం వెళ్లే రైళ్లను ఈ నెల 18, 19 తేదీల్లో పాలకొల్లు వరకే నడపబోతున్నారు. అలాగే విజయవాడ నుంచి నరసాపురానికి వచ్చే రైలును ఈ నెల 18న పాలకొల్లు వరకే నడుపుతారు. గుంటూరు నుంచి నరసాపురానికి వచ్చే రైలును సైతం ఈ నెల 19న భీమవరం వరకే నడుపుతారు. భీమవరం జంక్షన్ నుంచి నరసాపురానికి వెళ్లే రైలును అలాగే నిడదవోలు నుంచి నరసాపురానికి వచ్చే రైలును సైతం ఈ నెల 19వ తేదీన పాలకొల్లు వరకే నడుపుతారు.

అలాగే ఈ నెల 18, 19 తేదీల్లో గుంటూరు వెళ్లే రైలును నరసాపురం నుంచి కాకుండా పాలకొల్లు నుంచి నడుపుతారు. అలాగే ఈ రెండు తేదీల్లో విజయవాడ వెళ్లే రైళ్లను సైతం నరసాపురానికి బదులు పాలకొల్లు స్టేషన్ నుంచే నడుపుతారు. ఈ నెల 18న నరసాపురం నుంచి రాజమండ్రికి వెళ్లే రైలును కూడా పాలకొల్లు నుంచే నడుపుతారు. ఈ నెల 19న నరసాపురం నుంచి గుంటూరు వెళ్లే రైలును భీమవరం జంక్షన్ నుంచి నడుపుతారు. అదే రోజు నరసాపురం నుంచి నిడదవోలు జంక్షన్, విజయవాడ వెళ్లే రైళ్లను సైతం పాలకొల్లు నుంచే నడుపుతారు. కాబట్టి ఈ రైళ్లలో ప్రయాణించే వారు మార్పులు గమనించాల్సి ఉంటుంది.














Click it and Unblock the Notifications