జగన్ ఓట్ బ్యాంక్ పై పవన్ గురి - కీలక నిర్ణయం : సక్సెస్ అయ్యేనా..!?

జనసేనాని పవన్ కొత్త నిర్ణయాలకు సిద్దం అవుతున్నారు. జనసేన ఆవిర్భావ దినోత్సవ సభా వేదిక కీలక ప్రకటనలు చేయనున్నారు.

జనసేనాని పవన్ కొత్త నిర్ణయాలకు సిద్దం అవుతున్నారు. జనసేన ఆవిర్భావ దినోత్సవ సభా వేదిక కీలక ప్రకటనలు చేయనున్నారు. పొత్తుల పైన స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక.. ఎన్నికల వేళ సామాజిక సమీకరణాలపైన పవన్ ఫోకస్ చేసారు. ఆవిర్భావ సభకు ముందే ఎన్నికల్లో పార్టీ పరంగా ఏ వర్గానికి ఎటువంటి ప్రాధాన్యత ఇచ్చేదీ స్పష్టత ఇచ్చేందుకు కసతర్తు చేస్తున్నారు. ఇందుకోసం బీసీ.. కాపు నేతలతో సమావేశాలు ఏర్పాటు చేసారు. జనసేన ఒక్క వర్గానికి చెందిన పార్టీ ముద్ర పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వైసీపీ ఓట్ బ్యాంక్ పైన గురి పెడుతున్నారు.

కీలక నిర్ణయాల దిశగా పవన్

కీలక నిర్ణయాల దిశగా పవన్

పార్టీ ఆవిర్భావ సభ నాడు కీలక ప్రకటనల దిశగా పవన్ కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం ప్రధాన అంశాల పైన వరుస సమావేశాలు ఏర్పాటు చేసారు. ఎన్నికలకు సమాయత్తం కావాలని పవన్ డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా పొత్తుల పైన ఈ సభలోనే ప్రకటన చేస్తారా..మరింత సమయం తీసుకుంటారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఇటు పార్టీ నుంచి కీలక అంశాల్లో మాత్రం స్పష్టత ఇవ్వాలని భావిస్తున్నారు. దీని కోసం ఏపీలో సామాజిక సమీకరణాలు..ప్రాధాన్యత..రాజకీయంగా తీసుకోవాల్సిన నిర్ణయాలపైన పవన్ ఫోకస్ పెట్టారు. ప్రధానంగా వైసీపీ ఓన్ చేసుకంటున్న బీసీ ఓట్ బ్యాంకు పైన పవన్ గురి పెట్టారు. బీసీలకు ఎటువంటి ప్రాధాన్యత దక్కాల్సిన అవసరం ఉంది.. బీసీ వర్గం ఏం కోరుకుంటోంది..రాజకీయంగా ఏం చేయాలనే దాని పైన చర్చించేందుకు రేపు బీసీ నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసారు. బీసీ నేతల నుంచి అభిప్రాయ సేకరణ చేసి ఆవిర్భావ సభ వేదికగా పార్టీ నిర్ణయంగా ప్రకటించేందుకు సిద్దం అవుతున్నారు.
కాపు నేతలతోనూ పవన్ సమావేశం

కాపు నేతలతోనూ పవన్ సమావేశం


ఆదివారం పార్టీ రాష్ట్ర నేతలతోనూ పవన్ సమావేశం కానున్నారు. పొత్తుల అంశం పైన వారితో చర్చించి..వారి అభిప్రాయాలు సేకరించనున్నారు. అదే విధంగా నియోజకవర్గాల వారీగా సమీక్షలు ప్రారంభించాలని పవన్ నిర్ణయించారు. దీంతో...పొత్తులకు అంగీకరిస్తే ఏ అంశాల ప్రాతిపదికన ముందుకు వెళ్లాలనేది చర్చిస్తారని సమాచారం. ఇక..అదే రోజు మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య నేతృత్వంలో కాపు సంక్షేమ సేన ప్రతినిధులతో పవన్ భేటీ కానున్నారు. కాపులకు రిజర్వేషన్ల అంశం పైన చాలా రోజులుగా హరి రామజోగయ్య తన వాయిస్ వినిపిస్తున్నారు. నిరహార దీక్షకు దిగారు. పవన్ జోక్యంతో విరమించారు. సీఎం జగన్ కు గత ప్రభుత్వం నిర్ణయించిన విధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో అయిదు శాతం అమలు చేయాలని కోరారు. దీని పైన ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఇతర వర్గాల నుంచి వ్యతిరేకత లేకుండా.. అదే సమయంలో జనసేనాని కాపు రిజర్వేషన్ల పైన నిర్ణయం తీసుకుంటారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నిర్ణయం పవన్ కు రాజకీయంగా కీలకం కానుంది.

పవన్ నిర్ణయాల పై రాజకీయ ఉత్కంఠ..

పవన్ నిర్ణయాల పై రాజకీయ ఉత్కంఠ..


వచ్చే ఎన్నికల దిశగా అధికార వైసీపీ...ప్రధాన ప్రతిపక్ష టీడీపీ సమాయత్తం అవుతున్నాయి. పార్టీ ఆవిర్భావ సభ ద్వారా ఎన్నికల సమరశంఖం పూరించేందుకు పవన్ సిద్దమవుతున్నారు. సామాజిక సమీకరణంగా మారుతున్న ఏపీ ఎన్నికల్లో పవన్ తీసుకొనే నిర్ణయాలు కీలకం కానున్నాయి. ముఖ్యమంత్రి జగన్ ప్రతీ సభలో నా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలంటూ వారికి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. అటు టీడీపీ బీసీలు తమతోనే అంటూ చెప్పుకొస్తోంది. ఇప్పుడు జనసేనాని బీసీలు..కాపు నేతలతో సమావేశం వేళ తీసుకొనే నిర్ణయం ఎన్నికల వేళ ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. అదే సమయంలో టీడీపీతో పొత్తు ఖాయమైతే ఏ రకంగా బీసీలకు సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇస్తారేది ప్రధాన అంశం. పవన్ తన పార్టీ పరంగా తీసుకొనే నిర్ణయాలు..పొత్తు ఖాయమైతే వాటి అమలు పైన స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో..ఇప్పుడు పవన్ కల్యాణ్ తీసుకొనే కొత్త నిర్ణయాలపైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+