జగన్ దత్తపుత్రుడు కామెంట్స్ కు జనసేన కౌంటర్- చెప్పుతో కొడతామని వార్నింగ్..!

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా విపక్షంలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సీఎంగా ఉన్న జగన్ తీవ్ర విమర్శలు చేసేవారు. ఓ దశలో ఈ విమర్శల దాడి వ్యక్తిగతంగానూ వెళ్లిపోయింది. ముఖ్యంగా పవన్ పెళ్లిళ్లను, ఆయన వైవాహిక జీవితాన్ని టార్గెట్ చేస్తూ జగన్ చేసిన విమర్శలు హద్దులు దాటిపోయేవి. వీటిపై స్వపక్షంలోనూ అసంతృప్తి ఉండేది. అయినా జగన్ వేటినీ లెక్కచేయలేదు. అయితే గత ఎన్నికల్లో ఓటమి తర్వాత మాత్రం పవన్ పై జగన్ ఎప్పుడూ స్పందించలేదు.

తాజాగా విజయనగరం జిల్లా గుర్ల పర్యటనకు వెళ్లిన జగన్.. పవన్ పై ఎన్నికల తర్వాత తొలిసారి స్పందించారు. ఆయన్ను మరోసారి దత్తపుత్రుడని వ్యాఖ్యానించారు. గతంలో ఎన్నికలకు ముందు ఇదే పేరుతో పవన్ ను కెలికి విమర్శల పాలైన జగన్ ఇప్పుడు మరోసారి అదే విమర్శ చేయడంపై జనసేన నేతలు భగ్గుమంటున్నారు. గతంలో విపక్షంలో ఉండగా ఏమీ చేయలేకపోయిన జనసేన నేతలు ఇప్పుడు ప్రభుత్వంలో ఉండటంతో ఘాటుగా స్పందిస్తున్నారు.

janasena leader bolisetty satyanaayana shocking reaction to ys jagan s remark on pawan kalyan

నిన్న విజయనగరంలో పవన్ ను దత్తపుత్రుడంటూ జగన్ వ్యాఖ్యానించడంపై జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ ఘాటుగా స్పందించారు. జగన్ మోహన్ రెడ్డి గారు ఉండాల్సిన చోట్లు రెండే..ఒకటి జైల్లో.. రెండు పిచ్చి ఆసుపత్రిలో..అంటూ ఎక్స్ లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా.. మళ్లీ ఇంకోసారి పవన్ కల్యాణ్ ను దత్త పుత్రుడు అన్నావంటే నిన్ను చెప్పులతో కొట్టాల్సి వస్తుందంటూ జగన్ కు ఘాటు వార్నింగ్ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+