Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎవరివైపు ఉంటారో తేల్చుకోండి, ఓడినా గెల్చినా మీతోనే: జనసేన విలీనంపై పవన్ కళ్యాణ్ కామెంట్స్

తూర్పుగోదావరి: తాను ఎన్నికల్లో గెలిచినా ఓడినా.. ప్రజలకు అండగానే ఉంటానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జనసేన కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా కోనసీమ జిల్లా మండపేటలో ఆత్మహత్య చేసుకున్న 52 మంది కౌలు రైతుల కుటుంబాలకు పవన్‌ ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా మండపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

ఆ శక్తి గోదావరి జిల్లాల ప్రజలకే ఉందంటూ పవన్ కళ్యాణ్

ఆ శక్తి గోదావరి జిల్లాల ప్రజలకే ఉందంటూ పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించే శక్తి గోదావరి జిల్లాల ప్రజలకే ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. మార్పు రావాలంటే గోదావరి జిల్లాలతోనే సాధ్యమని చెప్పారు.వచ్చే ఎన్నికల్లో ఎవరివైపు నిలబడతారో నిర్ణయించుకోవాలని ప్రజలకు సూచించారు. తమ పార్టీ అభ్యర్థులను చూడొద్దని.. తనను చూడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు పవన్ కళ్యాణ్. గోదావరి జిల్లాల్లో మార్పు మొదలైతే పులివెందుల వరకు వెళ్తుందని అన్నారు.

మార్పు కోసమే జనసేన పార్టీ వచ్చిందన్నారు.

ఏపీలో ఎప్పటికైనా అధికారంలోకి వస్తామంటూ పవన్ కళ్యాణ్

ఏపీలో ఎప్పటికైనా అధికారంలోకి వస్తామంటూ పవన్ కళ్యాణ్

జనవాణి పెట్టగానే వైసీపీ నేతలకు మెలకువ వచ్చిందని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర భవిష్యత్తు మార్చాలంటే తాను ఒక్కడే పోరాడితే సరిపోదన్నారు. మీ అండదండలుంటే 2024లో కాకుంటే ఆ తర్వాతైనా అధికారంలోకి వస్తానని పవన్ అన్నారు. అధికారంలోకి వస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగు చేస్తాయపి. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తామని తెలిపారు.

ఓడినా.. గెల్చినా ప్రజలతోనేనంటూ పవన్ కళ్యాన్

గోదావరి వరద బాధితులకు జనసైనికులు సాయం చేయాలి. తెలుగు ప్రజల ఐక్యత కోరుకుంటున్నా. ఏపీ భవిష్యత్తుకు వైసీపీ ప్రభుత్వం హానికరం. వైసీపీ ప్రభుత్వం మరోసారి వస్తే ఏం జరుగుతుందో ఊహించాలి. నాకు ఎలాంటి కోరికలు లేవు. అధికారం వస్తే మంచిది. రాకున్నా నా పోరాటం ఆపను. గెలిచినా ఓడినా ప్రజలకు అండగానే ఉంటా. వంద తప్పులు సహిస్తాం.. భరిస్తాం.. తర్వాత తాట తీస్తాం. పోలీసులు కూడా వ్యవస్థ ప్రకారం పనిచేయాలి. అన్యాయం, తప్పు చేస్తే ప్రజలు ఎదురుతిరగాలి. ఎంతమందిపై కేసులు పెడతారు? జైలులో పెడతారు? శ్రీలంక పరిస్థితి చూడండి.. ఏమైందో తెలుస్తోందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

జనసేన పార్టీ విలీనంపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

చెల్లించే పన్నులనే ప్రభుత్వం ప్రజలకు ఇస్తోందన్నారు పవన్. తాము ప్రభుత్వంలో లేకున్నా కౌలురైతులకు సాయం చేస్తున్నామన్నారు. మనకు ధైర్యం లేకుంటే అరాచకమే రాజ్యం ఏలుతుందని హితవు పలికారు. ప్రభుత్వం తప్పు చేస్తే సరిచేసే బాధ్యత యువత తీసుకోవాలని సూచించారు. యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. నాయకుల వెంట జెండాలు మోసే యువత ఎందుకని ప్రశ్నించారు. నాయకులను నిలదీసే యువత కావాలన్నారు. కౌలురైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం ఇష్టపడటం లేదని పవన్‌ ధ్వజమెత్తారు. ఎన్నికలకు జనసేన సిద్ధంగా ఉన్నారు. తాము జనసేన పార్టీని ఏ పార్టీలోనూ విలీనం చేయమని స్పష్టం చేశారు. తన ప్రాణం ఉన్నంత వరకు జనసేన పార్టీ ఉంటుందని తేల్చిచెప్పారు జనసేనాని పవన్ కళ్యాణ్.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+