Pothina Mahesh: పోతిన మహేష్ కు జనసేన ఘాటు కౌంటర్- వైసీపీతో ముందే కుమ్మక్కు..!

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టికెట్ దక్కకపోవడంతో ఇవాళ పోతిన మహేష్ జనసేన పార్టీని వీడారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేసి ఓడిపోయిన ఆయనకు ఈసారి ఎన్డీయే పొత్తులో భాగంగా టికెట్ లభించలేదు. దీంతో ఇవాళ ఆయన పార్టీకి గుడ్ బై చెప్పేశారు. అనంతరం పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన పార్టీపైనా తీవ్ర విమర్శలకు దిగారు. పవన్ పై వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ తీవ్రంగా స్పందించింది.

పోతిన మహేష్ రాజీనామాపై జనసేన ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ ఘాటుగా స్పందించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి మంచి రోజులు వచ్చాయంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో ఓ వీడియో పెట్టారు. ఇందులో ఆయన.. మహేష్ గారిపై జనసైనికులు, వీరమహిళలు, ప్రజలు నుండి ఫిర్యాదులు వచ్చినా, ఎదుగుతున్న బీసీ నాయకుడు మారతాడని కళ్యాణ్ గారు ఓపిక పట్టారని తెలిపారు. అలాగే ఆయన వైసీపీతో కుమ్మక్కైన విషయం కూడా తెలుసన్నారు.

janasena s strong counter to resigned vijayawda leader pothina mahesh already colluded with ysrcp

విజయవాడలో బ్రాహ్మణుడి స్థలం కబ్జా విషయంలో వైసీపీ నేత గౌతమ్ రెడ్డికి వత్తాసు పలికినప్పుడే ఈయనపై చర్యలు తీసుకోవాల్సింది అంటూ బొలిశెట్టి సత్యనారాయణ వ్యాఖ్యానించారు. సుజనా చౌదరి వస్తే లేక మరెవరు విజయవాడ పశ్చిమ సీటుకు వచ్చినా మీకు డబ్బులివ్వాలా, ఇలా ఎంతకాలం రాజకీయాలు చేస్తారంటూ బొలిశెట్టి ప్రశ్నించారు. ఇలాంటి రాజకీయాలకు తెరపడుతుందని, మీ పోకతో విజయవాడలో జనసేన బలపడిందంటూ వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+