అమరావతిలో అబ్బురపరిచే భవనాలు, ఎన్నో ప్రత్యేకతలు (పిక్చర్స్)
విజయవాడ: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో భవనాల డిజైన్ సిద్ధమైంది. దీనిని జపాన్‌కు చెందిన మకీ అసోసియేట్ డిజైన్ చేసింది. హైకోర్టు, అసెంబ్లీ, గవర్నర్, ముఖ్యమంత్రి నివాసాలు, ఇతర ప్రధాన భవంతులు ఎలా ఉండాలో డిజైన్ చేసింది. ఇది రాజధాని అమరావతి నిర్మాణంలో మరో మైలురాయి.
రాజధానిలో 900 ఎకరాల్లో నిర్మించే ప్రభుత్వ భవనాల సముదాయ స్వరూపం సిద్ధమైంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ముగ్గురు భవన నిర్మాణ శిల్పుల మధ్య రాష్ట్ర ప్రభుత్వం పోటీ నిర్వహించగా వాటిలో జపాన్‌కు చెందిన మకీ అండ్ అసోసియేట్స్ రూపొందించిన డిజైన్ ఉత్తమమైనదిగా ఎంపికైన విషయం తెలిసిందే.
అమరావతిలో ప్రభుత్వ భవనాల సముదాయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంది. 2018 డిసెంబరుకు ప్రభుత్వ భవనాల నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తోంది. వీటిలో శాసనసభ, హైకోర్టులను ఐకానిక్ భవనాలుగా నిర్మించనుంది.
వీటి నిర్మామానికి రూ.700 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. రాజధానిలో 900 ఎకరాల్లో ప్రభుత్వ భవనాల సముదాయం నిర్మిస్తున్నారు. వీటిలో శాసనసభ, సచివాలయం, హైకోర్టు, రాజ్‌భవన్, ముఖ్యమంత్రి నివాసం, శాఖాధిపతుల కార్యాలయాలతో పాటు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, మంత్రులు, అధికారుల నివాస గృహాలు వంటివి ఉంటాయి.

అమరావతి అద్భుతం
ఈ డిజైన్‌లలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ సముదాయంలో ప్రారంభంలో ఓ పక్క సీఎం నివాసం, మరో పక్క రాజ్ భవన్ ఉంటాయి. ఆ తర్వాత ఓ పక్క శాసన సభ, మండలిలు ఉంటాయి. మరో పక్క హైకోర్టు ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఖాళీ స్థలాన్ని పబ్లిక్ ప్లాజా అననున్నారు. ఇందులోకి ప్రజలను అనుమతిస్తారు.

అమరావతి అద్భుతం
వీటితర్వాత ప్రాంతాన్ని మైస్ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దుతారు. దీనిలో ఓఫెన్ ఎయిర్ థియేటర్, కన్వెన్షన్ సెంటర్, సమావేశాశ మందిరాలు వంటివన్నీ వస్తాయి. వీటిలోనే ఒక స్మృతి చిహ్నం కూడా ప్రతిపాదించారు. వీటి తర్వాత వివిధ ప్రభుత్వ విభాగాధిపతుల కార్యాలయాలు ఉంటాయి.

అమరావతి అద్భుతం
వాటి తర్వాత వివిధ విభాగ అధిపతుల కార్యాలయాలు ఉంటాయి. వాటి తర్వాత నివాస భవనాలు వస్తాయి. ప్రభుత్వ భవనాల సముదాయంలో నిర్మించే భవనాలన్నింటిలో సచివాలయమే ఎత్తుగా ఉంటుంది. దీనిని 15 అంతస్తుల ఎత్తున నిర్మించాలన్న ఆలోచనగా ఉంది. 14వ అంతస్తులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం ఉంటుంది. 15వ అంతస్తులో సీఎం కొలువు తీరుతారు.

అమరావతి అద్భుతం
హెచ్ఓడీల కార్యాలయాల భవనాలు ఏడు అంతస్తుల ఎత్తున ఉంటాయి. ఇక్కడ నిర్మించే భవనాలు వేడిని తట్టుకునేలా డిజైన్ చేశారు. ప్రతి భవనం పైనా సోలార్ ప్యానళ్లు ఉంటాయి. ప్రభుత్వ భవనాల ఇంధన అవసరాల్లో 40 నుంచి 50 శాతం సౌర విద్యుత్ ద్వారా ఇక్కడే ఉత్పత్తు చేసుకోనున్నారు.

అమరావతి అద్భుతం
జపాన్ కంపెనీ డిజైన్లో ప్రధానంగా నాలుగు బ్లాకులు ఉన్నాయి. రాజ్ భవన్, సీఎం నివాసం ఉండే బ్లాకు, అసెంబ్లీ, హైకోర్టు నిర్మితమయ్యే బ్లాకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, హెచ్ఓడీల ఆఫీసులు ఉండే బ్లాకు, మంత్రులు, ఎమ్మెల్యేలుు, ఉన్నతాధికారుల క్వార్టర్లతో మరో బ్లాకు ఉంటుంది. ఉత్తరాన కృష్ణా నది నుంచి దక్షిణాన ఉన్న పాలవాగు వరకూ పైన పేర్కొన్న వరుసలోనే ఈ బ్లాకులు రానున్నాయి. గవర్నర్, సీఎం నివాసాలు నదీ ముఖంగా రానున్నాయి.












Click it and Unblock the Notifications