వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తక్షణం ఆపండి: బాబుకు జయలలిత లేఖ, 'పార్టీ మూసే ఆలోచనలో జగన్'

|
Google Oneindia TeluguNews

విజయవాడ/చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాశారు. చిత్తూరు జిల్లాలో పాలార్ నది పైన ఉన్న చెక్ డ్యాం ఎత్తు పెంపు ప్రతిపాదన పైన ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. డ్యామ్‌ పెంపు తక్షణం ఆపాలని ఆమె లేఖలో విజ్ఞప్తి చేశారు.

కాగా, చంద్రబాబు ఢిల్లీ పర్యటన శుక్రవారం పూర్తయింది. ఉదయం ఆయన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. చంద్రబాబు... 2014-15 ఆర్థిక లోటు భర్తీ, రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై చర్చించారు. పారిశ్రామిక రాయితీలు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు పెంచాలని కోరారు.

రాజధాని నిర్మాణానికి వచ్చే మూడేళ్లలో రూ.5వేల కోట్లకు పైగా నిధులు ఇవ్వాలని కోరారు. రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సహకారం అందించాలని, నిధుల విడుదలలో జాప్యం నివారించాలని కోరారు. అనంతరం రాజ్‌నాథ్ సింగ్, ఉమాభారతిలో సమావేశమయ్యారు. విభజన హామీలపై చర్చించారు.

 Jayalalithaa letter to AP government

పార్టీని మూసేయ్యాలా అని జగన్ ఆలోచన: జూపూడి

టిడిపి ప్రభుత్వం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంటే, దానికి అడ్డుకునేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోందని ఆ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్‌ శుక్రవారం మండిపడ్డారు.

ప్రభుత్వం స్విస్‌ ఛాలెంజ్‌ పనిలో ఉంటే, వైసిపి గ్లోబెల్స్‌ ప్రచారం చేస్తోందన్నారు. వైసిపి అధినేత జగన్‌ ఆస్తుల అటాచ్‌తో పార్టీని ఉంచాలా? మూసెయ్యాలా? అన్న సందిగ్ధంలో ఉన్నారని ఆక్షేపించారు. తప్పుడు ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని హితవు పలికారు.

English summary
Tamil Nadu Chief Minister Jayalalithaa write letter to AP government on palar dam in chittoor district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X