ఆ మాజీని లాగుతుంది జేసీనే: ప్రభాకర్ చౌదరికి చెక్ పెట్టేందుకు?.. బాబుకు తలనొప్పి

ప్రభాకర్ చౌదరికి చెక్ పెట్టి ఆయన స్థానంలో గురునాథ్ రెడ్డికి టికెట్ ఇప్పించుకోవాలనేది జేసీ ప్లాన్.

అనంతపురం: వైసీపీ నుంచి వలసలను హోరెత్తించడానికి అధికార టీడీపీ శతవిధాలా ప్రయత్నిస్తున్నట్లే కనిపిస్తోంది. రాయలసీమ నుంచి ఫిరాయింపుల పర్వాన్ని మరోసారి జోరందుకునేలా చేయాలనుకుంటున్న పార్టీ.. నాయకులకు గాలం వేసే పనిలో పడింది.

ఈ నేపథ్యంలోనే అనంతపురం మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి పేరు కూడా తెర పైకి వచ్చింది.ప్రస్తుత అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో తనకేమాత్రం పొసగని కారణంగా.. గురునాథ్ రెడ్డిని టీడీపీలోకి తీసుకొచ్చి ఆయనకు చెక్ పెట్టాలని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ప్రభాకర్ చౌదరితో విరోధం:

ప్రభాకర్ చౌదరితో విరోధం:

అనంత అంటే మొదటి నుంచి గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరు. ప్రత్యర్థిని దెబ్బ కొట్టేందుకు ఎప్పుడూ ఏదో ఒక వ్యూహం తెర పైకి వస్తూనే ఉంటుంది. ఇప్పుడు జేసీ కూడా అదే చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఒకే పార్టీలో ఉన్నప్పటికీ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి విరోధుల్లాగే వ్యవహరిస్తారు. రోడ్ల విస్తరణ పనుల నేపథ్యంలో వీరిద్దరి మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి.

 చెక్ పెట్టేందుకే:

చెక్ పెట్టేందుకే:

తాను రాజీనామా చేస్తా అంటే గానీ అనంతపురంలో రోడ్ల విస్తరణ పనులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదనే భావనలో జేసీ ఉన్నారు. రహదారుల విస్తరణలో కొన్ని భవనాలను తొలగించాల్సి రావడంతో.. ప్రభాకర్ చౌదరి దాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. దీంతో రోడ్ల విస్తరణ పనులు పెండింగ్ లోనే ఉన్నాయి.

తాజాగా జేసీ రాజీనామా వ్యాఖ్యలతో ప్రభుత్వం రోడ్ల విస్తరణకు పూనుకుంది. అనంత అర్బన్ లో తన మాట వినే ఎమ్మెల్యే లేకపోవడం వల్లే తనకంత పట్టు లభించడం లేదని జేసీ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే వ్యూహాత్మకంగా గురునాథ్ రెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

గురునాథ్ వస్తే:

గురునాథ్ వస్తే:

గురునాథ్ రెడ్డి పార్టీలోకి వస్తే అనంత రాజకీయం మరో మలుపు తీసుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది. ప్రభాకర్ చౌదరికి చెక్ పెట్టి ఆయన స్థానంలో గురునాథ్ రెడ్డికి టికెట్ ఇప్పించుకోవాలనేది జేసీ ప్లాన్. గురునాథ్ రెడ్డిని పక్కన పెట్టుకుని ప్రభాకర్ చౌదరి పట్టు తగ్గించాలని జేసీ భావిస్తున్నారు. అయితే టీడీపీ అధిష్టానం ఆయనకు టికెట్ ఇచ్చేందుకు ఒప్పుకుంటుందా? అంటే అనుమానమే.

 పార్టీకి తలనొప్పి:

పార్టీకి తలనొప్పి:

గురునాథ్ రెడ్డి చేరికను పక్కనపెడితే.. ప్రభాకర్ చౌదరి, జేసీల మధ్య విభేదాలు టీడీపీకి తలనొప్పిగా మారాయి. రోడ్ల విస్తరణ చేపట్టకపోతే రాజీనామా చేస్తానని జేసీ అనడంతో.. ప్రభుత్వం అందుకు పూనుకుంది. తన మాటను లెక్క చేయకుండా ఆ పనికి పూనుకున్నందుకు ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ చౌదరి రాజీనామా చేస్తానని అంటున్నారు. ఒకవేళ పనులు ఆగితే తాను రాజీనామా చేయాల్సి వస్తుందని జేసీ హెచ్చరిస్తున్నారు. ఈ ఇద్దరి తీరుతో టీడీపీ తల బద్దలు కొట్టుకుంటోంది. ఇలాంటి సమయంలో గురునాథ్ రెడ్డిని తీసుకొస్తే.. ఆ తలనొప్పి మరింత పెద్దదవడం ఖాయం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+