కీలక సూచనలు చేసిన జేడీ లక్ష్మీనారాయణ, జయప్రకాష్ నారాయణ

అమరావతి: దేశంలో 2,000 రూపాయల నోట్ల చలామణిని ఉపసంహరించుకుంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రముఖులు సానుకూలంగా స్పందిస్తోన్నారు. ఈ చర్యను స్వాగతిస్తోన్నారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ దీన్ని స్వాగతించాయి. ఈ మేరకు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్లు చేశారు.

దేశంలో 2,000 రూపాయల నోట్ల చలామణిని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఆ నోట్లను బ్యాంకుల్లో మార్పిడి, డిపాజిట్ చేసుకోవడానికి వీలు కల్పించింది. ఏ బ్యాంకులోనైనా 2,000 రూపాయల నోట్లను మార్చుకోవచ్చని తెలిపింది. నోట్లు మార్పిడికి కొన్ని షరతులు పెట్టింది.

 jdlakshminarayanajayaprakash

కాగా- కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యను సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ, లోక్‌సత్తా జయప్రకాష్ నారాయణ స్వాగతించారు. ఈ చర్యతో నల్లధనానికి అడ్డుకట్ట పడుతుందని అన్నారు. నల్లధనం నిల్వలన్నింటినీ వెలికి తీయవచ్చని పేర్కొన్నారు. ఈ మేరకు వారు ట్వీట్లు పోస్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు.

గతంలో పెద్ద నోట్ల రద్దు తరహాలో ఇప్పుడు కూడా మార్కెట్‌లో నగదు చలామణికి ఇది దోహదపడుతుందని వీవీ లక్ష్మీనారాయణ, జయప్రకాష్ నారాయణ వ్యాఖ్యానించారు. నల్లధనాన్ని అరికట్టడానికి ఇంకా చాలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని జయప్రకాష్ నారాయణ పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్రానికి కొన్ని సూచనలు చేశారు. అవినీతి, రియల్ ఎస్టేట్ లావాదేవీలు, ఎన్నికలలో ఓటర్లను ప్రలోభ పెట్టడం వంటి చర్యలను అరికట్టాలని అన్నారు.

 jdjayaprakash

ప్రతి రంగంలో సమగ్రమైన, వ్యవస్థాగత సంస్కరణలను తీసుకుని రావాల్సిన అవసరం ఉందని సూచించారు. అవినీతిని అరికట్టడం, రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో బ్లాక్ మనీనిని అరికట్టగలిగితే చాలావరకు సత్ఫలితాలు ఉంటాయని అన్నారు. రాజకీయపరమైన సంస్కరణలపైనా ఏకాభిప్రాయం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఆయా చర్యల వల్ల నల్లధనాన్ని అరికట్టవచ్చని, అదే జరిగితే దేశ ఆర్థికరంగం పురోగమిస్తుందని అన్నారు.

2,000 రూపాయల నోట్లను ఉపసంహరించుకోవడాన్ని స్వాగతిస్తున్నట్లు మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ చెప్పారు. సకాలంలో రిజర్వు బ్యాంక్ ఈ చర్య తీసుకుందని చెప్పారు. ఎన్నికల్లో డబ్బు ప్రభావాన్ని తగ్గించాలన్నది తమ ప్రధానమైన డిమాండ్‌ అని పేర్కొన్నారు. ఇంతకుముందు పెద్ద నోట్ల రద్దు అనుభవం ఉన్న నేపథ్యంలో- ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+