టీతో గెలుద్దామని.. ఓడాం: జీవన్‌రెడ్డి, చానళ్లపై వెంకయ్య

కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇప్పుడు నియోజకవర్గానికి ఒకటే పాఠశాల అని చెప్పడం సరికాదన్నారు. పేదలకు ఆంగ్ల విద్య అమలుతో పాటు ప్రయివేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లు వచ్చేలా చూడాలన్నారు.
సిగ్గుతో తలదించుకుంటున్నా: విహెచ్
తెలంగాణ ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలవడంపై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలతో సిగ్గుతో తల దించుకుంటున్నానన్నారు. పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని స్థాయుల్లో ప్రక్షాళన జరగాల్సి ఉందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని వీడి తెరాసలో చేరిన నేతలపై వీహెచ్ మండిపడ్డారు. పార్టీలో ఉండి పదవులన్నీ అనుభవించిన తర్వాత ఇంకో పార్టీలోకి మారడం దారుణమన్నారు.
టీవీ ఛానళ్ల బ్యాన్‌పై వెంకయ్య
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ9 ఛానళ్ల ప్రసారాలను తెలంగాణ రాష్ట్రంలో నిలిపివేయడాన్ని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఛానళ్ల నిలిపివేత నిషేధం అక్రమం, న్యాయ సమ్మతమైనదని కాదన్నారు. దీనిపై కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను కలసి మాట్లాడానని, ఛానళ్లను నిలిపివేతపై తగిన చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలిపారు. ఎంఎస్‌వోలు ఛానళ్లను వెంటనే పునరిద్ధరించాలన్నారు.












Click it and Unblock the Notifications