హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మూడో భార్యతో ఉంటూ చిక్కిన మంత్రి శంకర్ (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఘరానా దొంగ మంత్రి శంకర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతను 250 కేసుల్లో నిందితుడు. ఇప్పటికే 209 కేసుల్లో అతనికి శిక్ష పడింది. 22 సార్లు జైలుకు వెళ్లి వచ్చాడు. మహరాష్ట్రలోని లాతూర్‌లో శివన్న పేరుతో మూడో భార్యతో నివాసం ఉంటూ ఫైనాన్స్ వ్యాపారిగా నటిస్తూ వస్తున్నాడు. ఫైనాన్స్ వ్యాపారిగా అతనికి గుర్తింపు ఉంది.

అయితే, మంత్రి శంకర్ రాత్రి పూట హైదరాబాద్‌లోని ఇళ్లలో దొంగతనాలు చేసి తిరిగి లాతూర్ వెళ్లిపోతుంటాడు సోమవారం నార్త్ జోన్ డిసిపి ఆర్. జయలక్ష్మి మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. సికింద్రాబాదులోని చిలకలగుడా ప్రాంతానికి చెందిన మంత్రి శంకర్ అలియాస్ శివన్న అలియాస్ శివప్రసాద్ (53) దొంగతనాలు చేయడం ఆరితేరినవాడు

మంత్రి శంకర్ కొంత కాలంగా మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా ఔసా పట్టణంలో నివసిస్తూ వస్తున్నాడు. మంత్రి శంకర్‌పై హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లోని కార్ఖానా, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, బేగంపేట, ఎస్ఆర్ నగర్, పంజగుట్ట, ఉప్పల్, ముషీరాబాద్, సనత్‌నగర్, చిక్కడపల్లి, సిసిఎస్, గాంధీనగర్ తదితర పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.

మంత్రి శంకర్ అరెస్టు

మంత్రి శంకర్ అరెస్టు

చోరీ సొత్తును విక్రయిస్తూ మంత్రి శంకర్ లాతూర్ జిల్లాలో విలావంతమైన జీవితం గడుపుతున్నాడు. మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు.

మంత్రి శంకర్ అరెస్టు మూడో భార్యతో కాపురం

మంత్రి శంకర్ అరెస్టు మూడో భార్యతో కాపురం

చేస్తూ లాతూర్ జిల్లాలో పోలీసులకు చిక్కాడు. అతను రాత్రిపూట హైదరాబాదులోకి ప్రవేశించి దొంగతనాలు చేసి తిరిగి వెళ్లిపోతుంటాడు.

మంత్రి శంకర్ అరెస్టు

మంత్రి శంకర్ అరెస్టు

మంత్రి శంకర్‌పై సికింద్రాబాదులోని తిరుమలగిరి పోలీసు స్టేషన్‌లో వారెంట్ పెండింగులో ఉంది. అతనపై 250 కేసులున్నాయి.

మంత్రి శంకర్ అరెస్టు

మంత్రి శంకర్ అరెస్టు

లాతూర్ ప్రాంతానికి చెందిన మూడో భార్య తండ్రి సంజయ్ పాటిల్ (66)తో కలిసి మంత్రి శంకర్ దొంగిలించిన సొమ్మును విక్రయించేందుకు హైదరాబాద్ వచ్చి నార్త్ జోన్ పోలీసులకు చిక్కాడు.

మంత్రి శంకర్ అరెస్టు

మంత్రి శంకర్ అరెస్టు

మంత్రి శంకర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనాల చిట్టా విప్పాడు. అతని నుంచి రూ.12 లక్షల విలువైన బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మంత్రి శంకర్ అరెస్టు

మంత్రి శంకర్ అరెస్టు

దొంగతనాలకు వినియోగించే సామగ్రి గల సంచీనీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంత్రి శంకర్‌ను పట్టుకునన ఎస్సై జట్టును డిసిపి అభినందించారు.

మంత్రి శంకర్ అరెస్టు

మంత్రి శంకర్ అరెస్టు

దొంగిలించిన మరింత బంగారాన్ని లాతూర్‌లోని ఐసిఐసిఐ బ్యాంకులో దాచిపెట్టినట్లు శంకర్ తెలిపినట్లు డిసిపి తెలిపారు.

English summary
Jewellary thief Mantri Shnakar has been nabbed by Hyderabad North Zone police. He was staying in Maharastra with his third wife.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X