రాత్రిపూట అసభ్యకర సందేశాలు: జేఎన్టీయూలో ప్రొఫెసర్ వేధింపు, ఆందోళన

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదులో గల జేఎన్టీయూలో ఓ ప్రొఫెసర్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని విద్యార్థులు ఆందోళనకు దిగారు. అకడమిక్ అసిస్టెంట్ దేవేందర్‌ను సస్పెండ్ చేయాలని జేఎన్టీయూ విద్యార్థులు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

విద్యార్థినీల పట్ల ఆయన అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఆయనను వెంటనే విధుల నుండి తప్పించాలని డిమాండ్ చేశారు.

రాత్రిపూట ఆయన కాల్స్‌ చేయడంతో పాటు అసభ్యకర మెసేజ్‌లతో తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఫోన్ నెంబర్ ఇవ్వాలని, ఎప్పుడు ఫోన్ చేసినా మాట్లాడాలని వేధిస్తున్నారని విద్యార్థినులు ఆరోపించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్‌ దేవేందర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. కాగా, విచారణ కమిటీ వేశామని రిజిస్ట్రార్ చెప్పారు.

 JNTU students agitations against professor harassment

కలెక్టరేట్ పైనుంచి దూకిన ఇంజినీరింగ్ విద్యార్థి, స్వల్పగాయాలు

ప్రకాశం జిల్లాలో కలెక్టరేట్ పైనుంచి ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని దూకారు. ఆమెకు స్వల్పగాయాలు అయ్యాయి. మానసికస్థితి సరిగా లేదంటుని చెబుతున్నారు.

విజయవాడలో ఐఐటీ విద్యార్థి అదృశ్యం

కృష్ణా జిల్లాలోని మొగల్రాజపురంలో నారాయణ ఐఐటీ కళాశాలలో ఫస్టియర్‌ విద్యార్థి అదృశ్యమయ్యాడు. గుణదలలో నివాసముంటున్న మనోజ్‌తేజ గురువారం ఉదయం కళాశాలకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. రాత్రి అయిన మనోజ్‌ ఇంటికి రాకపోవడంతో తండ్రి కళాశాలకు వెళ్లి ఆరా తీశారు. వివిధ ప్రాంతాల్లో తిరిగినా ఆచూకీ లభించకపోవడంతో ఆందోళన చెందిన ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+