Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Virat Kohli: కోహ్లీ పై అభిమానం చాటుకున్న జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి..!!

క్రికెట్ ప్యాన్స్ ఇప్పుడు కోహ్లీ నామ జపిస్తున్నారు. ప్రపంచ కప్ సెమీస్ లో ముంబాయి వేదికగా విరాట్ అరుదైన ఫీట్ సాధించారు. క్రికెట్ దేవుడు..తన సతీమణి..ఫ్యాన్స్ సాక్షిగా సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు సచిన్. ముంబాయి వేదికగా సచిన్ రికార్డును బ్రేక్ చేసి క్రికెట్ ఫ్యాన్స్ మనసు గెలుచుకున్నాడు. విరాట్ చేసిన ఈ అరుదైన రికార్డు ను బాలీవుడ్ ప్రముఖులు ప్రత్యక్షంగా వీక్షించగా..టాలీవుడ్ సెలబ్రెటీలు సోషల్ మీడియా వేదికగా ప్రశంసలతో ముంచెత్తారు.

విరాట్ పై ప్రశంసలు:వన్డే క్రికెట్ లో సచిన్ 452 ఇన్నింగ్స్ లో 49 శతకాలు సాధించిన ప్లేయర్ గా రికార్డ్ క్రియేట్ చేశారు. ఇప్పుడు ఆ రికార్డును విరాట్ బద్దలు చేశాడు. ఇప్పటివరకు మొత్తం 49 సెంచరీలు చేసిన కోహ్లీ.. ఈరోజు జరిగిన న్యూజిలాండ్, భారత్ మ్యాచ్‏లో మరో శకతం పూర్తిచేసి సచిన్ రికార్డ్ బ్రేక్ చేశారు. కోహ్లీ ఈ రికార్డ్ బ్రేక్ చేయడంతో కింగ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ స్టేడియంలో సందడి చేశారు. ఈ ఫీట్ సాధించిన కోహ్లీ పైన దర్శకులు రాజమౌళి ప్రశంసలు కురిపించారు. 'రికార్డ్స్ ఉన్నదే బద్దలు కొట్టడానికి.. కానీ సచిన్ రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు అతని రికార్డ్స్ బద్దలు కొట్టాలని ఎవరూ కలలో కూడా ఊహించి ఉండరు. కానీ మన కింగ్ కోహ్లీ కొట్టేశాడు' అంటూ ట్వీట్ చేశారు.

Jr NTR and Rajamouli Congratulates Virat on his 50th Century in Wolrd Cup semis against NZ

క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా:విరాట్ చేసిన సెంచరీ పైన జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. "49 వన్డే సెంచరీలు. ఇది తిరుగులేని రికార్డు. దీనిని ఇండియాలో ఒక భారతీయుడు బ్రేక్ చేశాడు. ప్రపంచకప్ సెమీఫైనల్‌లో దీని కంటే మెరుగైనది మరొకటి లేదు. కంగ్రాట్స్ కోహ్లీ. మీరు 50 స్టాండింగ్ ఒవేషన్‌లు...మరిన్నింటికి అర్హులు" అంటూ తారక్ చేసారు. ఇక ఇప్పటికే వాఖండే స్టేడియంలో సందడి చేసిన వెంకటేశ్.. కోహ్లీ సెంచరీపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. అలాగే యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్, మిథాలీ రాజ్ కోహ్లీపై ప్రశంసలు కురిపించారు. కివీస్ టీం అన్ని విభాగాల్లోనూ పటిష్ఠంగా ఉండటంతో గత ప్రపంచ కప్ ఫలితం ఫ్యాన్స్ మనసులో నుంచి తొలిగిపోలేదు. నాటి ఫలితానికి టీమిండియా ముంబాయి వేదికగా రివేంజ్ తీర్చుకుంది.

ఫైనల్ లోకి ఎంట్రీతో:బ్యాటింగ్ లో 397 పరుగులు...70 పరుగుల తేడాలో కివీస్ పైన విజయం ఫ్యాన్స్ కు సంతోషాన్నిచ్చింది. బ్యాటింగ్ లో కోహ్లీ, అయ్యర్ సెంచరీలు..బౌలింగ్ లో షమీ 7 వికెట్లతో రికార్డు సాధించటంతో భారత్ మరోసారి ప్రపంచ కప్ పైనల్స్ లో అడుగు పెట్టింది. అహ్మదాబాద్ వేదికగా ఈ నెల 19న జరిగే ఫైనల్స్ కోసం లక్ష మందికి పైగా అభిమానులు తరలి వస్తున్నారు. వారి సమక్షంలో 140 మంది భారతీయుల మద్దతుతో టీమిండియా టైటిల్ ఫేవరెట్ లో బరిలోకి దిగుతోంది. భారత్ తో ఫైనల్స్ లో తలపడే జట్టు ఏదనేది ఈ రోజు కోల్ కతాలో ఆసీస్ వర్సస్ సఫారీల మ్యాచ్ లో తేలనుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+