బ్రహ్మాండం: బాలకృష్ణకు జూ ఎన్టీఆర్ కితాబు, సీనియర్లని..
హైదరాబాద్: టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఆదివారం నాడు తన బాబాయ్, హిందూపురం శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ పైన ప్రశంసలు కురిపించారు. హైదరాబాదులో జరుగుతున్న మేము సైతం కార్యక్రమానికి హాజరైన జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడారు.
మూడో తరగతి ఫిలిమ్ ఇండస్ట్రీ కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావును గుర్తుంచుకుందని అన్నారు. రామారావు, నాగేశ్వర రావుల ఆశీస్సులు తమ పైన ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. హుధుద్ తుఫాను నేపథ్యంలో ఉడతా భక్తిగా తాము తమ వంతు సాయం చేస్తున్నామన్నారు.
ప్రజలు తమను ఎప్పుడు చల్లగా చూస్తున్నారన్నారు. ఈ సందర్భంగా ఆయన సీనియర్ హీరోలు అంటూ, వారికి కితాబిచ్చారు. బాబాయ్ (బాలకృష్ణ) పాటలు పాడటం తాను చూశానని, బ్రహ్మాండంగా పాడారని చెప్పారు. అందరికి ధన్యవాదాలు అన్నారు.

కాగా, హుధుద్ తుఫాను బాధితుల సహాయార్థం తెలుగు సినీ పరిశ్రమ మేము సైతం కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీని ద్వారా వచ్చిన మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి అందించనున్నారు. ఆదివారం జరుగుతున్న ఈ కార్యక్రమం యావత్ తెలుగు ప్రజలను అలరిస్తోంది.
మేము సైతం కార్యక్రమంలో హీరో నందమూరి బాలకృష్ణ పాట పాడి అలరించారు. ఆయన రెండు పాటలు మాడారు. గాయని కౌసల్యతో ఓ పాట, మాళవికతో కలిసి ఓ పాట పాడారు. విజిల్స్ వేసి ఉత్సాహపరిచారు. తెలుగు టాప్ హీరో మహేష్ బాబును కథానాయిక సమంత ఇంటర్వ్యూ చేశారు. సమంత అడిగిన ప్రశ్నలకు మహేష్ సమాధానం ఇచ్చారు.












Click it and Unblock the Notifications