పంజాబ్ కింగ్స్ స్టార్ ఆల్‌రౌండర్ కీలక నిర్ణయం.. ఆ జట్టుకు బై బై చెప్పేసి..!

పంజాబ్ కింగ్స్ స్టార్ ఆల్‌రౌండర్ శశాంక్ సింగ్ దేశీయ క్రికెట్లో ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు. 2026-27 సీజన్ నుంచి ఛత్తీస్‌గఢ్‌ను విడిచిపెట్టి పుదుచ్చేరి తరఫున ఆడనున్నట్లు ఆయన ప్రకటించాడు. ఛత్తీస్‌గఢ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ నుంచి తాను నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్(ఎన్వోసీ) పొందినట్లు శశాంక్ సింగ్ వెల్లడించారు.

క్రికెట్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్- అన్ని ఫార్మాట్లకు టీం ఇండియా క్లాస్ ప్లేయర్ గుడ్ బై..!!
క్రికెట్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్- అన్ని ఫార్మాట్లకు టీం ఇండియా క్లాస్ ప్లేయర్ గుడ్ బై..!!

శశాంక్ సింగ్ మాట్లాడుతూ.." అవును.. నేను ఛత్తీస్‌గఢ్‌ను విడిచి వెళ్తున్నాను . నేను ఛత్తీస్‌గఢ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ నుంచి ఎన్వోసీ కూడా పొందాను. 2026-27 సీజన్ నుంచి పుదుచ్చేరి తరపున ఆడతాను. గత సీజన్‌లో నా భుజానికి, వేలికి తీవ్రమైన గాయాలయ్యాయి. కానీ ఆ కష్ట సమయంలో ఛత్తీస్‌గఢ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ నాకు ఏమాత్రం మద్దతు ఇవ్వలేదు. దీంతో పాటు సీజన్ ముగిసిన తర్వాత ఛత్తీస్‌గఢ్ క్రికెట్ ప్రీమియర్ లీగ్ 2026 కోసం ప్రకటించిన ఆటగాళ్ల జాబితాలో నా పేరు లేదు. అంతేకాకుండా బెంగళూరులో జరిగిన ప్రీ-సీజన్ క్యాంప్‌కు వెళ్లిన ఛత్తీస్‌గఢ్ జట్టులో కూడా నా పేరు లేదు. నన్ను ఎందుకు ఎంపిక చేయలేదని నేను అడిగాను, కానీ నాకు ఎలాంటి సమాధానం రాలేదు " అని శశాంక్ సింగ్ అన్నారు.

Punjab Kings Star Shashank Singh Quits Chhattisgarh Sets to Play for Puducherry Full Details Here

"నేను ఛత్తీస్‌గఢ్ తరపున దేశీయ క్రికెట్ ఆడకుండా, కేవలం ఐపీఎల్‌లో మాత్రమే ఆడాలనుకుంటున్నాను. నిజమేమిటంటే గతేడాదే బీసీసీఐ 2023-24 దేశీయ పరిమిత ఓవర్ల సీజన్‌కు గాను ఉత్తమ ఆల్-రౌండర్‌గా నాకు లాలా అమర్‌నాథ్ అవార్డును ప్రదానం చేసి గౌరవించింది" అని శశాంక్ సింగ్ వెల్లడించాడు.

స్టార్ ఆల్ రౌండర్ రెడ్డికి బిగ్ షాక్: ఏకంగా 8 సంవత్సరాల పాటు క్రికెట్ ఆడకుండా నిషేధించిన ఐసీసీ
స్టార్ ఆల్ రౌండర్ రెడ్డికి బిగ్ షాక్: ఏకంగా 8 సంవత్సరాల పాటు క్రికెట్ ఆడకుండా నిషేధించిన ఐసీసీ

34 ఏళ్ల శశాంక్ సింగ్ ఇప్పుడు పుదుచ్చేరి తరపున వైట్-బాల్ క్రికెట్‌పై దృష్టి పెట్టాలనుకుంటున్నాడు . నివేదికల ప్రకారం శశాంక్ సింగ్ ఈ సీజన్‌లో రెడ్-బాల్ క్రికెట్‌కు విరామం తీసుకుని, టీ20 క్రికెట్‌లో పూర్తి ఆల్-రౌండర్‌గా రాణించేందుకు తన బౌలింగ్‌ను మెరుగుపరుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇండియాలో అత్యంత నిలకడైన దేశీయ వైట్-బాల్ ఆటగాళ్లలో ఒకరైన శశాంక్ సింగ్.. 2024-25 సీజన్‌లో కూడా అద్భుతంగా రాణించాడు.శశాంక్ సింగ్ 2024-25 విజయ్ హజారే ట్రోఫీలో కేవలం ఏడు మ్యాచ్‌లలో 450 పరుగులు చేసి, 11 వికెట్లు పడగొట్టాడు . అలాగే 2024-25 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఏడు మ్యాచ్‌లలో 188 పరుగులు చేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+