ఊహించని దర్శకుడితో కార్తి కొత్త సినిమా.. ఈ జానర్ లో ఫస్ట్ టైమ్..?

కోలీవుడ్ హీరో కార్తి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం సర్దార్ 2 సినిమాతో బిజీగా ఉన్నారు. తమిళంలో 2007 లో రిలీజ్ అయిన పరుత్తివీరన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆయన తెలుగులోనూ పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆవారా, నా పేరు శివ, ఊపిరి, ఖైదీ, పొన్నియన్ సెల్వన్ లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. కార్తి సినిమాలు అంటే తెలుగులోనూ టైర్ 1 సినిమాల మాదిరిగా ఆయనకు బ్రాండ్ పెరిగిపోయింది.

కార్తి నటించిన సర్దార్ 2 చిత్రానికి సంబంధించి ఇటీవల రిలీజైన టీజర్ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. సర్దార్ 2 మూవీ ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ మూవీ రాబోయే సెప్టెంబర్ 10న థియేటర్లలో విడుదల కానుంది. 'సర్దార్ 2' చిత్రానికి పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్, ఐవీ ఎంటర్‌ టైన్‌ మెంట్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. సర్దార్ 2 మూవీలో మాళవికా మోహన్, ఆషికా రంగనాథ్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే ప్రముఖ నటుడు ఎస్ జే సూర్య కీలక పాత్రలో మెప్పించనున్నారు.

ఓటీటీలోకి లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ 'హృదయం మురళి'
ఓటీటీలోకి లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ 'హృదయం మురళి'

అయితే కార్తి ఫ్యాన్స్ కు వరుసగా గుడ్ న్యూస్ లు అందుతున్నాయి. అదేంటి అంటే కార్తి 30 వ చిత్రం కూడా భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకోగా.. ఈ మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇక తాజాగా కార్తి 31 సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన తాజాగా వెల్లడైంది. ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ మూవీ కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాగా వినోదాత్మక చిత్రంగా ఉండబోతుందని మేకర్స్ వెల్లడించారు. ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

karthi working on massive project a film with star director Mohan Raja crafted family entertainer

తని ఒరువన్ ,వేలైక్కారన్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో దర్శకుడు మోహన్ రాజా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దాంతో కార్తి 31 మూవీపై భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ మూవీ షూటింగ్ 2026 లో చివరలో ప్రారంభం కానుందని సమాచారం అందుతోంది. ఇక ఈ మూవీకి సంబంధించి నటీనటులు, టెక్నికల్ అంశాలకు సంబంధించిన వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+