హైదరాబాద్ లో రాత్రికి భారీవర్షాలు.. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు: సీపీ సజ్జనార్

తెలంగాణా రాష్ట్రంలో మళ్ళీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక తాజాగా హైదరాబాద్ నగరంలో వర్షాలపై వాతావరణ కేంద్రం కీలక అలెర్ట్ ఇచ్చిందని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. నేడు రాత్రి
హైదరాబాద్ నగర వ్యాప్తంగా సోమవారం రాత్రి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక జారీ చేసింది.

వర్షంతో ప్రజలకు కీలక సూచనలు చేసిన సీపీ సజ్జనార్

ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రజలకు కీలక సూచనలు చేశారు. రాత్రికి భారీ వర్షం కురవనున్న క్రమంలో నగరవాసులందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప బయటకు వెళ్లొద్దు అని, అనవసర ప్రయాణాలు చేయవద్దని సలహా ఇచ్చారు.

Hyderabad rain alert CP Sajjanar warns citizens of heavy rains on Monday night said stay in homes

నగరవాసులు ఇళ్ల నుంచి బయటకు రావద్దన్న సీపీ సజ్జనార్

నగరవాసులు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, ఇంట్లోనే ఉండాలని సూచించారు. ఇప్పటికే బయట ఉన్నవారు వర్ష తీవ్రత పెరిగే లోపు తమ పనులను త్వరగా ముగించుకుని క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలని సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. వర్షం మొదలైన తర్వాత బయట ఉంటే ఇబ్బంది కావచ్చని హెచ్చరించారు. ముఖ్యంగా నీరు నిలిచిన రహదారులు, ముంపునకు గురయ్యే లోతట్టు ప్రాంతాల గుండా ప్రయాణాలు చేయడం అస్సలు సురక్షితం కాదని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు.

వాహనదారులు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త

నగరంలో ట్రాఫిక్ జామ్ లు అయ్యే అవకాశం ఉన్న కారణంగా ఇళ్ళకు వెళ్ళటానికి ఆలస్యం అవుతుందని, అందుకు తగినట్టు ప్లాన్ చేసుకోవాలని సూచించారు. వాహనదారులు డ్రైవింగ్ చేసేటప్పుడు వేగం తగ్గించి, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రోడ్డు పరిస్థితులను గమనించి నెమ్మదిగా ప్రయాణించాలని అన్నారు. రోడ్లు స్కిడ్ అయ్యి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు.

టీటీడీ చేసిన ఆ తీర్మానం వెనుక భారీ అవినీతి కుట్ర.. దానికోసం లోకేష్ ఒత్తిడి!
టీటీడీ చేసిన ఆ తీర్మానం వెనుక భారీ అవినీతి కుట్ర.. దానికోసం లోకేష్ ఒత్తిడి!

వర్షాల కారణంగా రహదారులపై నీరు ఉంటే ఇబ్బంది జాగ్రత్త

అత్యవసర సమయాల్లో కూడా అప్రమత్తంగా ఉంటూ అందరూ సురక్షితంగా ఇళ్లకు చేరుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వర్షాల కారణంగా రహదారులపై నీరు నిలవడం, ట్రాఫిక్ సమస్యలు ఏర్పడే అవకాశం ఉండటంతో ప్రజలు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇచ్చారు. నగరవాసులు ఈ హెచ్చరికలను పాటించి తమ భద్రతను కాపాడుకోవాలని సీపీ సజ్జనార్ కోరారు. వాతావరణం సాధారణ స్థితికి వచ్చే వరకు అనవసర ప్రయాణాలు నివారించడం మంచిదని ఆయన సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+