సత్యం కేసు: తుది తీర్పు 28న, కోర్టుకు రామలింగరాజు
హైదరాబాద్: సత్యం కుంభకోణం కేసు విచారణ ముగిసింది. జులై 28న తీర్పు తేదీ ప్రకటించనున్నట్లు సీబీఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) ప్రత్యేక కోర్టు గురువారం స్పష్టం చేసింది. కేసు విచారణకు సత్యం రామలింగరాజు సహా నిందితులందరూ హాజరయ్యారు.
కాగా, సత్యం కుంభకోణం కేసుపై సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ మూడు రోజుల క్రితం ముగిసిన విషయం తెలిసిందే. ఈ కేసులో సత్యం రామలింగరాజుతో పాటు ఇతర నిందితులను కోర్టు దోషులుగా నిర్దారించింది. ఈ కేసులో తుది తీర్పును కోర్టు ఈనెల 26కు వాయిదా వేసింది. గురువారం 28వ తేదీకి వాయిదా వేసింది.

ఇది కోట్లాది రూపాయల కుంభకోణం కేసు ఇది. ఈ కేసు విచారణ గత ఐదేళ్లుగా సాగుతోంది. సత్యం కుంభకోణం కేసులో తుది తీర్పును ఈ నెల 28వ తేదీన వెల్లడించనున్నట్లు అడిషినల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి చెప్పారు.
తుది తీర్పును వెలువరించడానికి కోర్టు 216 మంది సాక్షులను విచారించింది. దాదాపు 3-38 పత్రాలను పరిశీలించింది. 2009 జనవరి 7వ తేదీన సత్యం కుంభకోణం కేసు వెలుగులోకి వచ్చింది. కోట్లాది రూపాయలను సర్దుబాటు చేసేందుకు సత్యం కంపెనీకి చెందిన ఖాతాలను తారుమారు చేశానని అప్పటి సత్యం కంప్యూటర్స్ చైర్మన్ రామలింగ రాజు అంగీకరించారు. ఇది ప్రపంచ కార్పోరేట్ ప్రపంచాన్ని దిమ్మతిరిగేలా చేసింది.












Click it and Unblock the Notifications