జస్ట్ పందొమ్మిది రోజులు..పరేషాన్ ఎందుకు రాజా..! చంద్రన్న. రాజన్న మద్య పెరుగుతున్న పందాలు..!!

అమరావతి/హైదరాబాద్ : ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు స‌రిగ్గా పందొమ్మిది రోజుల సమయం మాత్రమే ఉంది. నేతల గంభీరాలు, రాజకీయ ప్రకటనలు, ముహూర్తాలు, నేమ్ ప్లేట్ల హడావిడి, ప్రమాణ స్వీకారాల తారీఖుల ఎంపిక.. ఒకటా రెండా.. ఏపిలో రాజకీయం తారాస్థాయికి చేరినట్టే బెట్టింగులు కూడా ఆకాశాన్నట్టుంతున్నయి. పార్టీ అధినేతల అంచనాలు కూడా హిమాలయ పర్వాతాలను మరిపిస్తున్నాయి. అధినేతల ఆత్మ‌విశ్వాసం సంగ‌తి ఎలా ఉన్నా వారి మాట‌ల‌ను క్యాష్ చేసుకునేందుకు ఇటు రాజ‌న్న భ‌క్తులు, అటు చంద్ర‌న్న విధేయులు రెడీ అయ్యారు. గెలుపోట‌ముల సంగ‌తి ఎలా ఉన్నా. తాము మాత్రం కొద్దిరోజుల్లో ఎంతో కొంత కూడ‌బెట్టుకుంటే బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చ‌ని ఆశ‌. మొత్తంమ్మీద‌ ఏపి రాజ‌కీయం మాంచి హీటెక్కుతోంది.

ఫలితాల సమయం దగ్గరపడుతోంది..! బెట్టింగ్ రాయుళ్ల పంట పండుతోంది..!!

ఫలితాల సమయం దగ్గరపడుతోంది..! బెట్టింగ్ రాయుళ్ల పంట పండుతోంది..!!

ఏపిలో రాజకీయ పార్టీలు తమ గెలుపు పట్ల ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. అటు చంద్రబాబు, ఇటు జగన్ ఎవరి గెలుపు పట్ల వారు భరోసా వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. సీయస్ వర్సెస్ సీఎం అన్నట్టు వ్యవహారం సాగుతుంటే రేపోమాపో కేబినెట్ స‌మావేశం పెడ‌తా! ఎవ‌డు అడ్డొస్తాడో చూస్తానంటూ చంద్రబాబు సాహసోపైత ప్రకలనలు చేస్తున్నారు. అధికారులు ఎవ‌రు స‌మావేశానికి రాకుండా డుమ్మా కొడ‌తారో.. చూస్తానంటూ మ‌రో క‌న్ను అటువైపు తిప్పారు. ఎన్నికల ఫలితాలకు ఇంకా మూడు వారాల లోపు సమయం ఉండగానే వాతావరణం మాంచి వేడెక్కుతోంది.

చంద్రన్నదే అదికారం..కాదు కాదు.. జగనన్నదే..! వేడెక్కిన ఏపి రాజకీయం..!!

చంద్రన్నదే అదికారం..కాదు కాదు.. జగనన్నదే..! వేడెక్కిన ఏపి రాజకీయం..!!

ఇంత‌కీ జ‌గ‌న్ వ‌స్తే.. పాల‌న ఎలా ఉంటుంది. చంద్ర‌బాబు చేతికి ద‌క్కితే ఎలా ఉండ‌బోతుంద‌నే చ‌ర్చ‌లు కూడా ఏపీ వ్యాప్తంగా ఊపందుకున్నాయి. ఒక్క‌సారి పిల్లాడు అవ‌కాశం ఇవ్వ‌మంటున్నాడు ఇద్దాం అంటూ ఓ వ‌ర్గం. అధికారం లేకుండానే ల‌క్ష‌కోట్లు స్వాహా చేశాడు. తానే సీఎం అయితే.. ఏపీలో భూములు ఉంటాయా అనేది మ‌రో వితండ‌వాద‌న‌. మ‌రి.. మూడో నేత సేనాని కింగ్‌మేక‌ర్ కాగ‌లిగితే.. అప్పుడు ఐదేళ్ల రాజ‌కీయం య‌మా రంజుమీద ఉంటుంద‌నే చ‌ర్చ‌లు కూడా ఏపిలో మొద‌ల‌య్యాయి.

గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న అధినాయకులు..! ఫలితాలు ఎవరికి అనుకూలమో..!!

గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న అధినాయకులు..! ఫలితాలు ఎవరికి అనుకూలమో..!!

ఎవ‌రికి వారు తాము ఎడ్జ్‌లో ఉన్నామంటూ లోలోన లెక్క‌లు వేసుకుంటున్నార‌ట‌. ప‌నిలో ప‌నిగా.. ఒక‌వేళ టీడీపీ స‌మీపం వ‌ర‌కూ వ‌చ్చి కుర్చీకు దూర‌మైతే, వైసీపీ నుంచి ఎంత‌మంది బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు సిద్ధంగా ఉన్నారంటూ లెక్క‌లు వేసుకుంటున్నారు అదికార పార్టీ నేతలు. అలా గాక‌పోయినా క‌నీసం జ‌న‌సేన‌లో గోడ‌దూకే బ్యాచ్ ఏదైనా ఉందా అనే చర్చలు కూడా మొదలుపెట్టినట్టు చర్చ జరుగుతోంది. న‌రేంద్ర‌మోదీ మొన్నీ మ‌ధ్య బెంగాల్‌లో త‌న‌కు మ‌మ‌త ఎమ్మెల్యేలు 40 మంది ట‌చ్‌లో ఉన్నార‌ని బ‌య‌ట‌ప‌డ్డారు. తాము మాత్రం అలా బ‌య‌ట‌ప‌డ‌ట్లేదంటూ వైసీపీ మ‌రో అడుగు ముందుకేసి చెబుతున్నట్టు తెలుస్తోంది.

బాబు వర్సెస్ జగన్.. మద్యలో పవన్..! ఆసక్తి రేపుతున్న రాజకీయాలు..!!

బాబు వర్సెస్ జగన్.. మద్యలో పవన్..! ఆసక్తి రేపుతున్న రాజకీయాలు..!!

ఇదిలా ఉండగా ఇప్ప‌టికే నాలుగైదు పార్టీలు మారిన నేత‌ల క‌ద‌లిక‌లు, వారికి ఉన్న ఇబ్బందులు, త‌మ వ‌ద్ద‌కు వ‌స్తే జ‌రిగే ప్రయోజనం గురించి మ‌రో వ‌ర్గం విప‌రీతంగా ప్ర‌చారం చేస్తుంద‌ట‌. అయితే ఇదంతా జ‌రుగుతుందా అంటే చెప్ప‌టం కూడా క‌ష్ట‌మే. ఎందుకంటే ఏ పార్టీకీ ఆ పార్టీ తామే ప‌వ‌ర్‌లోకి రాబోతున్నామంటూ అంచ‌నాలు వేసుకుంటుంది. త‌మ త‌ర‌పున గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు వారు గ‌డ‌ప దాట‌కుండా క‌ట్ట‌డి చేసేందుకు అన్ని మార్గాల‌ను సిద్ధం చేసుకున్నార‌ట‌. మ‌రి ఈ లెక్క‌న‌ ఈ ఇర‌వై రోజుల వ్య‌వ‌ధిలో రాజ‌కీయంగా ఇంకెన్ని కీల‌క ప‌రిణామాలు చోటుచేసుకోబోతున్నాయ‌నేది ఆస‌క్తిగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+