ఏపీలో ప్రభుత్వం మారినా 'కడప'ను కరుణించిన నరేంద్రమోడీ
భారతీయ రైల్వే కాలానికి అనుగుణంగా మారుతూ ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలను సమకూరుస్తోంది. అందుకనుగుణంగా అధునాతన సాంకేతికను ఉపయోగిస్తోంది. దేశవ్యాప్తంగా 13,600 రైళ్లు నడుస్తూ ప్రతిరోజు రెండుకోట్ల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడుపుతూ రద్దీని నివారిస్తోంది. తాజాగా కడప మీదుగా రాకపోకలు సాగించే కాచిగూడ-మురుడేశ్వర్ వారాంతపు రైళ్లను పొడిగించారు. ప్రతి మంగళవారం, శుక్రవారం నడుస్తున్న రైళ్లను మురుడేశ్వర్ వరకు పొడిగించారు.
ప్రతి మంగళవారం, శుక్రవారం
కాచిగూడ-మంగళూరు (12789) , మంగుళూరు-కాచిగూడ (12790) రైళ్లను మురుడేశ్వర్ వరకు పొడిగించారు. కాచిగూడలో ప్రతి మంగళవారం, శుక్రవారం ఉదయం 6.05 గంటలకు బయలుదేరే 12789 రైలు తర్వాతరోజు మధ్యాహ్నం 2.00 గంటలకు మురుడేశ్వర్ కు చేరుకుంటుంది. జడ్చర్ల, మహబూబ్ నగర్, కర్నూలు, కడప, రేణిగుంట, కాట్పాడి, జోలార్ పేట, సేలం, కోయంబత్తూరుమీదుగా ప్రయాణిస్తుంది. అలాగే మురుడేశ్వర్ లో ప్రతి బుధవారం, శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు బయలుదేరి తర్వాతరోజు రాత్రి 11.40 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది.

భక్తుల నుంచి వస్తున్న విన్నపాల మేరకు
ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు. మురుడేశ్వర్ ప్రముఖ పుణ్యక్షేత్రం కావడంతో ప్రయాణికుల నుంచి వస్తున్న విన్నపాల మేరకే అక్కడి వరకు మంగళూరు వెళ్లే రైళ్లను పొడిగించినట్లు తెలిపారు. భక్తుల రద్దీని బట్టి, రైల్వేకు సమకూరే ఆదాయాన్ని బట్టి భవిష్యత్తులో వీటిని ప్రతిరోజు నడపడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. కడప మీదుగా తమిళనాడువైపు, కేరళవైపు, కర్ణాటకవైపు, తెలంగాణవైపు పలు రైళ్లు అందుబాటులో ఉన్నాయని, భవిష్యత్తులో వీటిసంఖ్యను పెంచడానికి ప్రయత్నిస్తామని కడప రైల్వే సీనియర్ కమర్షియల్ ఇన్ స్పెక్టర్ తెలిపారు.












Click it and Unblock the Notifications