అక్కడ గెలవాలంటే ఏం చేయాలో నాకు తెలుసు: సీఎం జగన్
పూర్తిస్థాయి వేసవికాలం రాకుండానే ఏపీలో వాతావరణం వేడెక్కింది. అయితే అది సాధారణ వాతావరణం కాదు.. రాజకీయ వాతావరణం. ఎన్నికల ప్రకటన రావడమే తరువాయి వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ పోరు జగరనుంది. యుద్ధానికి సిద్ధమైన ఈ రెండు పార్టీలు అందుకు కావల్సిన 'ఆయుధాలను' సిద్ధం చేసుకుంటున్నాయి. కచ్చితంగా తామే గెలుస్తామనే ధీమాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంది. అయితే ఆ పార్టీ విశ్వాసాన్ని బలహీనపరిచి ఎలాగైనా తామే గెలుపొందాలనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ వ్యూహాలు రచిస్తోంది.
ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లాలో కీలకమైన నియోజకవర్గం ప్రొద్దుటూరు. ప్రస్తుతం ఇక్కడినుంచి వైసీపీ తరఫున రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి మల్లెల లింగారెడ్డిపై 45,148 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో కూడా రాచమల్లు టీడీపీ అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డిపై 12,945 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మూడోసారి కూడా టికెట్ తనదే అనే ధీమాలో రాచమల్లు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం ఇక్కడ ముగ్గురు ప్రధాన నాయకులు పోటీపడుతున్నారు. వారిలో ఎవరికి దక్కుతుందో చూడాలి.

నియోజకవర్గంగా ఏర్పాటైన తర్వాత 1952లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసిన కుందాల బాలనారాయణరెడ్డి విజయం సాధించారు. 1955 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తరఫున ఆయనే గెలుపొందారు. 1952 నుంచి 1978 వరకు జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. 1952 నుంచి 2019 వరకు జరిగిన ఎన్నికల్లో ఆరుసార్లు కాంగ్రెస్ పార్టీ విజయాన్ని కైవసం చేసుకుంది. వైసీపీ ఆవిర్భావం తర్వాత రెండుసార్లు గెలిచింది. టీడీపీ ఇక్కడి నుంచి మూడుసార్లు మాత్రమే గెలుపొందగలిగింది. 1994 గాలిలో కూడా కాంగ్రెస్ పార్టీయే గెలిచింది. అభ్యర్థులు ఖరారైన తర్వాత రసవత్తర పోరు సాగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!











Click it and Unblock the Notifications