అక్కడ గెలిచిన తర్వాతే నాకు కనపడన్నా: సీఎం జగన్
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో మెజారిటీ స్థానాలను దక్కించుకునేందు అధికార వైసీపీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా వైసీపీకి బలంగా ఉన్న జిల్లాల్లో దెబ్బకొట్టడంద్వారా ఇతర జిల్లాల్లో గెలుపు సులభంగా దక్కుతుందని టీడీపీ భావిస్తోంది. దీంతో త్వరలో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాయచోటి నియోజకవర్గంలో విజయం సాధించేందుకు ఇరు పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలను రచిస్తున్నాయి.
ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా ఉమ్మడి కడపలో కీలకమైన నియోజకవర్గం రాయచోటి. ప్రస్తుతం ఇక్కడినుంచి వైసీపీ తరఫున ప్రభుత్వ చీఫ్ విప్ గా ఉన్న గడికోటి శ్రీకాంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి ఆర్.రమేష్ రెడ్డిపై 32,862 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో కూడా గడికోట టీడీపీ అభ్యర్థి రమేష్ రెడ్డిపై 34,782 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో శ్రీకాంత్ రెడ్డి వైసీపీ తరఫున బరిలోకి దిగి టీడీపీ అభ్యర్థి ఎస్ఎం సుగవాసిపై 56,931 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2009లో తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన గడికోట ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సుగవాసి పాలకొండ్రాయుడుపై 14,832 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అనంతర రాజకీయ పరిణామాల్లో ఆయన వైసీపీలో చేరారు.

రాయచోటి నియోజకవర్గంగా ఏర్పాటైన తర్వాత 1952లో జరిగిన కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీ తరఫున వై.ఆదినారాయణరెడ్డి విజయం సాధించారు. తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి 1955 ఎన్నికల్లో గెలుపొందారు. తర్వాత స్వతంత్ర పార్టీ, జనతాపార్టీ, ఇండిపెండెట్ అభ్యర్థి ఒక్కొక్కసారి గెలిచాయి. తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో కేవలం 1999, 2004 ఎన్నికల్లో మాత్రమే గెలవగలిగింది. ఈ రెండు ఎన్నికల్లో సుగవాసి పాలకొండ్రాయుడు విజయాన్ని దక్కించుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా అయినప్పటికీ బీజేపీ, జనసేనతో కలిసి ఏర్పడే కూటమి బలంద్వారా ఈసారి గెలుపు తమదే అనే ధీమాలో టీడీపీ ఉండగా, ఈసారి కూడా తామే సులువుగా విజయం సాధిస్తామని వైసీపీ భావిస్తోంది.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications