కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

క్రికెట్ పందేలు, జల్సాలకోసం బైక్‌ల దొంగతనం, పోలీసులకు చిక్కాడిలా...

క్రికెట్ పందేలకు, జల్సా జీవితానికి అలవాటుపడిన వెంకటేశ్వరరాజు అనే యువకుడిని కడప పోలీసులు మంగళవారం నాడు అరెస్ట్ చేశారు. డిగ్రీ వరకు చదవిని వెంకటేశ్వరరాజు జల్సాల కోసం బైక్‌ల దొంగతనానికి పాల్పడేవాడు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

కడప:క్రికెట్ పందేలకు, జల్సా జీవితానికి అలవాటుపడిన వెంకటేశ్వరరాజు అనే యువకుడిని కడప పోలీసులు మంగళవారం నాడు అరెస్ట్ చేశారు. డిగ్రీ వరకు చదవిని వెంకటేశ్వరరాజు జల్సాల కోసం బైక్‌ల దొంగతనానికి పాల్పడేవాడు. నిందితుడు వెంకటేశ్వరరాజు 18 బైక్‌లను చోరీ చేశారు.

కడప జిల్లా రాజుపాలెం మండలం టంగుటూరు గ్రామానికి చెందిన వెంకటేశ్వరరాజు డిగ్రీ వరకు చదువుకొన్నాడు.డిగ్రీ పూర్తైన తర్వాత అల్లరిగా తిరగడం మొదలుపెట్టాడు. స్నేహితులతో కలిసి క్రికెట్‌ పందేలు నిర్వహించేవాడు.తర్వాత క్రికెట్‌ పందేలే వ్యసనంగా మార్చుకున్న అతను బైక్‌ దొంగతనాలకు అలవాటు పడ్డాడు.

Kadapa police arrested two persons for bike robbery


క్రికెట్ పందెల్లో ఒకటి, రెండు సార్లు డబ్బు రావడంతో పందేలకే బానిస అయ్యాడు. తాగుడుకు అలవాటు పడిన యువకుడు జల్సా జీవితం అనుభవించడం మొదలు పెట్టాడు. క్రికెట్‌ పందేలు, జల్సా జీవితం గడపడానికి చేతిలో డబ్బు లేకపోవడంతో ప్రొద్దుటూరు ఆర్టీసీ బస్టాండులోని బైక్‌ను కొన్ని రోజుల క్రితం దొంగిలించాడు. ఇలా ప్రొద్దుటూరు, మైదుకూరు ప్రాం తాల్లో సుమారు 18 బైక్‌లను చోరీ చేశా డు.

దొంగిలించిన ద్విచక్ర వాహనాల్లో కొన్నింటిని బద్వేలులో ఉన్న తన స్నేహితుడు వెంకటసుబ్బయ్యకు తక్కువ ధరకు విక్రయించాడు. తమ సిబ్బందితో కలిసి మడూరు రోడ్డులో వాహన తని ఖీలు చేపట్టిన పోలీసులకు వెంకటేశ్వరరాజుపై అనుమానం వచ్చింది. వాహనానికి సంబంధించిన రికార్డులు చూపాలని అడిగారు.

పోలీసులను చూసి భయపడ్డాడు వెంకటేశ్వరరాజు. పోలీసుల విచారణలో అసలు విషయాన్ని బయటపెట్టాడు నిందితుడు వెంకటేశ్వరరాజు.ప్రొద్దుటూరు ఆర్టీసి బస్టాండులో ఆరు, కడప ఆస్పత్రి ఆవరణంలో రెండు, కోట వీధిలో ఒకటి, ఎర్రగుంట్ల బైపాస్‌రోడ్డులో ఒకటి, మైదుకూరు ఆర్టీసీ బస్టాండులో 7 బైక్‌లను చోరీ చేసినట్లు అతను అంగీకరించాడు.

వాటిలో ఆరు బైక్‌లను బద్వేలుకు చెందిన తన స్నేహితుడు వెంకటసుబ్బయ్యకు విక్రయించినట్లు పోలీసులకు వివరించాడు. వెంకటసుబ్బయ్యను కూడా అరెస్టు చేశారు. పలు ప్రాంతాల్లో దాచిన బైక్‌లను స్వాధీనం చేసుకొని, ఇద్దరిని రిమాండుకు పంపిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.

English summary
Kadapa police arrested two persons for bike robbery case on Venkateswara Raju and venkatasubbaiah thefted 18 two wheelers from various places in Kadapa district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X