మంగళగిరి ఎయిమ్స్ పై ఫిర్యాదు-కాకినాడ జంట కన్నీరుమున్నీరు..!

ఏపీలో ప్రతిష్టాత్మగ జాతీయ వైద్య విద్య, పరిశోధనా సంస్ధ, ఆస్పత్రి అయిన మంగళగిరి ఎయిమ్స్ తొలిసారి ఓ వివాదంలో చిక్కుకుంది. ఎయిమ్స్ ఆస్పత్రి వైద్యులపై కాకినాడ జిల్లాకు చెందిన ఓ కుటుంబం మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ కూతురు బైక్ పై నుంచి కింద పడి గాయాల పాలైతే ఎయిమ్స్ ఆస్పత్రికి తెచ్చామని, అయితే డాక్టర్లు నిర్లక్ష్యంతో తమ పాప ప్రాణాలు తీశారని వారు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..

గుంటూరు జిల్లాలో ఉన్న మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిలో ఇవాళ ఓ చిన్నారి అనూహ్యంగా చనిపోయింది. ఎమ్మారై స్కానింగ్ తీసుకుండగా 14 నెలల తన్వి శ్రీ అనే చిన్నారి చనిపోయింది. కాకినాడకు చెందిన కొంతం గంగరాజు, కుమారి దంపతుల కుమార్తె అయిన తన్విశ్రీ స్థానికంగా ఓ బైక్ ప్రమాదంలో గాయపడటంతో తల్లితండ్రులు నాలుగు రోజుల క్రితం మెరుగైన వైద్యం కోసం ఎయిమ్స్ కు తీసుకొచ్చారు. అయితే పాపకు ఎమ్మారై స్కాన్ చేస్తుండగా చనిపోయినట్లు తెలుస్తోంది.

kakinada couple complaints against mangalagiri aiims doctors over 14 month daughter death

ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి ఆస్పత్రి అని ఎయిమ్స్ కు తీసుకొస్తే తమ పాప ప్రాణం తీశారంటూ తన్విశ్రీ తల్లితండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఎయిమ్స్ డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే తమ చిన్నారి చనిపోయిందంటూ ఆస్పత్రి వద్ద బంధువులతో కలిసి ఆందోళనకు దిగారు. అయితే ఆస్పత్రి నుంచి స్పందన లేకపోవడంతో వారు మంగళగిరి పోలీసుల్ని ఆశ్రయించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి తమ చిన్నారి ప్రాణం తీసిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. దీనిపై పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+