దుర్గమ్మ దర్శనానికి వెళ్తుండగా విషాదం.. నలుగురు భవానీ భక్తులు మృతి!

కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో గురువారం వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న భయానక రోడ్డు ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి బయలుదేరిన భవానీ భక్తులపైకి వేగంగా వచ్చిన స్కార్పియో దూసుకెళ్లడంతో నలుగురు భవానీ భక్తులు ప్రాణాలు కోల్పోగా.. మరో ఘటనలో లారీ ఢీకొని ఆశా వర్కర్ ప్రాణాలు కోల్పోయారు.

Cyclone Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీకి తుఫాను ముప్పు!
Cyclone Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీకి తుఫాను ముప్పు!

నలుగురు భవానీ భక్తులు దుర్మరణం
విజయనగరం జిల్లా డెంకాడ ప్రాంతానికి చెందిన భవానీ భక్తులు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ దర్శనం కోసం ఓ ప్రైవేటు బస్సులో బయలుదేరారు. బస్సు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కత్తిపూడి జాతీయ రహదారి వద్దకుచ చేరుకోగానే సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన నిలిపి మరమ్మతులు చేపట్టాడు. ఈ క్రమంలో సుదీర్ఘ ప్రయాణంతో అలసిపోయిన భక్తులు కొంతసేపు ఉపశమనం కోసం టీ తాగేందుకు బస్సు దిగి సమీపంలోని షాపు వైపు నడుచుకుంటూ వెళ్తున్నారు. సరిగ్గా అదే సమయంలో అతివేగంతో దూసుకొచ్చిన ఓ స్కార్పియో వాహనం నడుచుకుంటూ వెళ్తున్న భక్తులపైకి అతివేగంతో దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు భక్తులు అక్కికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరొకరు తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతుండగా.. స్థానికులు వెంటనే స్పందించి ఆస్పత్రికి తరలించే యత్నం చేశారు. అయితే మార్గమధ్యలోనే ఆయన పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయారు. మృతులు చిరిగిడి ఎర్రయ్య, లింగాల సీతారామ్,బోనేల సత్తిబాబు, తాటిపూడి శివప్రసాద్‌గా గుర్తించారు.

Kakinada Road Accident 4 Bhavani Devotees Killed Asha Worker Dies in East Godavari CM Chandrababu expresses grief

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రాథమిక దర్యాప్తు అనంతరం స్కార్పియో డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని నిర్ధారించి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకోవాలని వెళ్తున్న తోటి భక్తులు కళ్ల ముందే ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబాల్లో, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

జెన్ జీ కోసం వ్యూహాలు మార్చేస్తున్న జగన్, చంద్రబాబు-ఢిల్లీ ట్విస్టుల వేళ..!
జెన్ జీ కోసం వ్యూహాలు మార్చేస్తున్న జగన్, చంద్రబాబు-ఢిల్లీ ట్విస్టుల వేళ..!

సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
ఈ ఘోర ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన భవానీ భక్తుల కుటుంబాలకు తన సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మంత్రి నారా లోకేష్ ఈ ఘటనపై ఎక్స్ వేదికగా స్పందించారు. "కాకినాడ జిల్లా కత్తిపూడి వద్ద రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా డెంకాడకు చెందిన భవానీ భక్తులు మృతి చెందడం చాలా బాధాకరం. మృతులకు నివాళులు అర్పిస్తున్నాను. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది" అని మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు.

హైవేపై లారీ బీభత్సం.. ఆశా వర్కర్ దుర్మరణం
మరో ఘటనలో తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నేషనల్ హైవేపై జరిగిన ప్రమాదంలో ఓ ఆశా వర్కర్ దుర్మరణం పాలయ్యారు. రాజానగరం మండలం వెలుగుబంద గ్రామానికి చెందిన ఆశా వర్కర్ ముత్యం వెంకటేశ్వరి, తన అక్కకూతురు జి.నాగశిరీషతో కలిసి బైక్‌పై రాజానగరం పీహెచ్సీ నుంచి స్వగ్రామానికి బయలుదేరారు. రాజానగరం వైఎస్సార్ కూడలి దాటుతున్న సమయంలో రాజమహేంద్రవరం వైపు నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఓ లారీ వీరి బైక్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.

లారీ ఢీకొనడంతో వెంకటేశ్వరి లారీ కిందపడిపోగా.. లారీ ఆమెను కొంతదూరం ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిద్దరిని స్థానికులు రాజానగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ వెంకటేశ్వరి మృతి చెందగా.. నాగశిరీష్ ప్రస్తుతం ఆస్పత్రిలో తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+