చంద్రబాబు ఫోటో లేదు: మంత్రి కామినేనికి చేదు, ఎమ్మెల్యే సుగుణమ్మ నిలదీత
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ మంత్రి కామినేని శ్రీనివాస రావుకు తిరుపతి పర్యటనలో చేదు అనుభవం ఎదురయింది. స్విమ్స్‌లో నిర్వహించిన ఓ అధికారిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే సుగుణమ్మను ఆహ్వానించలేదు. దీంతో ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. దీనిపై సుగుణమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించలేదని చెప్పారు. గతంలోను ఇలా జరిగిందని, అప్పుడు కూడా తనకు ఎలాంటి పిలుపు రాని సంఘటనలు ఉన్నాయని చెప్పారు.
ఈ విషయమై కామినేనిని నిలదీసేందుకు తాను వచ్చానని సుగుణమ్మ చెప్పారు. ఇక్కడి బ్యానర్లు, ఫోటోలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో లేదని, స్విమ్స్ గవర్నింగ్ కౌన్సెల్‌కు చంద్రబాబు చైర్మన్‌గా ఉన్నారని చెప్పారు. ఆయన ఫోటోను ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications