కాణిపాకం వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్
తెలుగు రాష్ట్రాల్లోని మహిమాన్విత క్షేత్రాల్లో ఏపీలోని చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ఒకటి. నిత్యం వేల సంఖ్యలో భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి దర్శిస్తారు. ఇక వేసవి సెలువుల్లో అయితే రద్దీ ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ ఆలయానికి వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.
కాణిపాకం ఆలయంలో పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ యంత్రాంగం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో భక్తులు అధికంగా తరలి వస్తున్నారు. ఈ క్రమంలో ఆలయ అధికారులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే తాజాగా కాణిపాకం ఆలయానికి వచ్చే భక్తులకు అధికారులు కీలక సూచన చేశారు. వీఐపీ దర్శనం టికెట్ ధరను రూ.300 లకు పెంచాలని నిర్ణయించారు.

కాణిపాకం ఆలయంలో వీఐపీ దర్శనం టికెట్ ధరను రూ.300 లకు పెంచాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. దీనికి సంబంధించిన అనుమతి కోసం కమిషనర్‌కు ఆలయ కమిటీ సభ్యులు ప్రతిపాదనలు పంపారు. అలాగే.. సిఫార్సులతో వచ్చే భక్తులకు ఇకపై టికెట్ తప్పనిసరి చేసింది. ఆలయ ఉద్యోగులు కూడా టికెట్లు కొనుగోలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు ఆలయ ఈవో పెంచల కిషోర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. వేసవి సెలవుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ఇక కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ప్రస్తుతం సర్వదర్శనం టికెట్స్ రూ.100, రూ.150 భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. సిఫార్సులపై వచ్చే భక్తులకు ఆలయ ఉత్తర భాగంలోని వీఐపీ ద్వారం వద్ద రూ.150 టికెట్ ఇస్తున్నారు. తాజా నిర్ణయం ప్రకారం ఇకపై వీఐపీ ద్వారం గుండా దర్శనానికి వెళ్లే భక్తులకు టికెట్ ధర రూ.300 గా తీర్మానించారు.












Click it and Unblock the Notifications