చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాణిపాకం ఆలయంలో క్వారంటైన్ సెంటర్ అంటూ ప్రచారం.. అరెస్ట్

|
Google Oneindia TeluguNews

చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయాన్ని కరోనా వైరస్ పేషెంట్ల కోసం క్వారంటైన్ సెంటర్‌గా మార్చారనే వార్తలు కొద్ది రోజుల కిందట రాష్ట్రంలో సంచలనం కలిగించాయి. దీనికి సంబంధించిన కొన్ని వీడియో క్లిప్పులు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. కొందరు భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకులు దీనిపై తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

Recommended Video

Fake News Buster : 05 కాణిపాకం గుడి క్వారంటైన్ సెంటరా ? బాంద్రా లో జరిగిన దానికి కారణం ఫేక్ న్యూస్

ఇదే విషయంపై ప్రభుత్వంపై విమర్శలు చేసిన విష్ణువర్ధన్ రెడ్డి వ్యక్తి అరెస్టు అయ్యారు. సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారనే కారణంతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై ఎఫ్ఐఆర్‌ను నమోదు చేశారు. కాణిపాకం ఆలయాన్ని క్వారంటైన్ సెంటర్‌గా మార్చడం వెనుక దురుద్దేశం ఉందని విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారని చెబుతున్నారు. హిందువుల మనోభావాలను కించపరిచేలా కాణిపాయం ఆలయాన్ని క్వారంటైన్ సెంటర్‌గా మార్చారని ఆరోపించారు.

Kanipakam temple turned as quarantine centre, says Vishnuvardhan Reddy, arrested

రాష్ట్రవ్యాప్తంగా పలు ఇంజినీరింగ్ కళాశాలల భవనాలు అందుబాటులో ఉన్నప్పటికీ.. ఉద్దేశపూరకంగా కాణిపాకం ఆలయాన్ని ఎంచుకోవడానికి కారణాలను వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిగా ఉంటూ ఒక మతాన్ని అణగదొక్కడం, మరో మతాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. కాణిపాకం ఆలయం నుంచి వెంటనే క్వారంటైన్ సెంటర్‌ను తొలగించాలని, క్షమాపణలు చెప్పాలని పట్టుబట్టారు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సున్నితమైన అంశాలపై సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారిని అరెస్టు చేయాలంటూ వారు విజ్ఙప్తి చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ఒక వర్గానికి చెందిన ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యనాలు చేశారనే కారణంతో ఆయనపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

English summary
Kanipakam temple In Chittoor district of Andhra Pradesh turned as Quarantine Centre for Covid-19 Coronavirus patients alleged by a Vishnuvardhan Reddy was arrested by the Police. He alleged that Kanipakam Varasidhi Vinayakaswamy temple made as Quarantine cetre for Covid-19 patients.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X