కార్తీక మాసంలో ముఖ్యమైన రోజులు- పూజలు, కలిగే పుణ్యఫలితాలు..!!

కార్తీక మాసం అంటే ఒక పూజల మాసం. ఆధ్మాత్మిక వెల్లివిరిసే నెల. దీపావళి మర్నాడే కార్తీకమాసం ప్రారంభమవుతుంది. కానీ ఈ ఏడాది దీపావళి మర్నాడు కాకుండా రెండో రోజు నుంచి కార్తీకమాసం మొదలవుతోంది. నవంబరు 14 మంగళవారం సూర్యోదయం సమయానికి పాడ్యమి ఉండడంతో ఆ రోజు నుంచి ఆకాశదీపం ప్రారంభమవుతోంది. అంటే నవంబరు 14 మంగళవారం నుంచి కార్తీక మాసం మొదలవుతోంది. ఈ నెల రోజులు ఏ తిథి రోజు ఏ పూజలు చేయాలి..చేస్తే కలిగే పుణ్యఫలితాల గురించి పండితులు స్పష్టత ఇచ్చారు.

రేపటి నుంచి కార్తీక మాసం:కార్తీకమాసం అంతా మనసంతా ఆధ్యాత్మిక పరిమళాలతో నిండిపయేలా చేయటమే ఈ మాసం ప్రత్యేకత. సాధారణ రోజుల్లో పూజలు చేసినా కార్తీకమాసం మాత్రం ప్రత్యేకమైన ఆధ్యాత్తిక భావన కలిగిస్తుంది. శ్రావణమాసంలో శుక్రవారానికి ఎంతటి ప్రాముఖ్యత ఉందో కార్తీక మాసంలో సోమవారాలకు అంతటి విశిష్టత ఉంది. అంతేకాదు కార్తీకంలో వచ్చే దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులకు అంతటి విశిష్టత ఉంది. శ్రావణమాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రార్థిస్తే..కార్తీకమాసంలో ఆమె పతిదేవుడైన శ్రీమహావిష్ణువు పూజింటం ఈ మాసం ప్రత్యేకత. రోండో రోజు తోడబుట్టిన సోదరి ఇంటికి వెళ్ళి ఆమె చేతి భోజనం చేసి, కానుకలు ఇచ్చి వచ్చిన వారికి యమగండం వాటిల్లదని పురాణాలు చెబుతున్నాయి. దీనినే భగనీ హస్త భోజనం అంటారు. భగినీ అంటే సోదరి. ఆమె చేతి వంట తినేదానిని భగినీ హస్త భోజనం అంటారు.

Karthika masam will begin on November 14 2023, Special days and Significance

ప్రతీ రోజు ప్రత్యేకమే:నవంబరు 17 శుక్రవారం- నాగుల చవితి. సుబ్రహ్మణ్యేశ్వరుని పూజ చేయాలి. నాగుల పుట్టకు వెళ్లి పూజ చేసి పాలు పోస్తారు. పంచమి : పంచిమిని జ్ఞానపంచమి అని అని కూడా అంటారు. పంచమి తిథి రోజున సుబ్రహ్మణ్యస్వామి అనుగ్రహం కోసం ఆర్చనలు చేయించుకున్నవారికి జ్ఞానవృద్ధి కలుగుతుందంటారు. షష్టి : అంటే సుబ్రహ్మణ్య షష్టి. ఈ రోజు కూడా నాలుగ పూజ చేయాలి. పూజ తరువాత బ్రహ్మచారికి ఎర్రని వస్త్రం లేదా కండువా..పంచె దానం చేస్తే సంతానం లేనివారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని సంతానం ఉన్నవారికి శుభాలు కలుగుతాయని చెబుతారు. నవంబరు 27 కార్తీకమాసం రెండో సోమవారం, కార్తీకపూర్ణిమ. మాసంలో అత్యంత పవిత్రమైన రోజు..శివాలయం వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవడం వల్ల సర్వపాపాలూ ప్రక్షాళనమవుతాయి.

ఏం రోజు ఏం చేయాలి:ఆ రోజున యువతులు వివాహం జరిగిన తొలి సంవత్సరంలో కార్తీక పౌర్ణమి పూజను చేస్తారు. గుమ్మడి పండుతో పాటు 16 రకాల పండ్లను శివాలయంలో ఇస్తారు. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రుడు వచ్చాక అద్దంలో చంద్రుడిని చూసి పూజల చేసిన అప్పుడు భోజనం చేస్తారు. ఇలా వివాహం జరిగిన తొలి సంవత్సరం ఇలా చేస్తే వారికి మంచి పిల్లలు పుడతారని కాపురం సుఖ సంతోషాలతో సాగుతుందని అంటారు.డిసెంబరు 04 కార్తీకమాసం మూడో సోమవారం, డిసెంబరు 11- కార్తీకమాసం నాలుగో సోమవారం, డిసెంబరు 13 బుధవారం- పోలి స్వర్గం. కార్తీక మాసంలో ఆఖరి రోజు. చాలా విశిష్టమైన రోజు. పితృదేవతల పేరుతో పేదలకు అన్నదానం చేస్తే వారికి స్వర్గప్రాప్తి లభిస్తుంది.

Karthika masam will begin on November 14 2023, Special days and Significance

నియమనిష్టలతో :కార్తీకమాసం నెలరోజులూ అత్యంత నియమనిష్టలతో ఉంటారు. కార్తీమాసం నియమాలు పాటించేవారు కేవలం శాఖాహారం మాత్రమే తీసుకోవాలని పండితులు చెబుతున్నారు. చలిగాలులు పెరిగే సమయం కాబట్టి ఈ నెలలో పేదలకు, అనాధలకు స్వెట్టర్లు, దుప్పట్లు, కంబళ్ళు దానం చేస్తే శివ కేశవవుల అనుగ్రహం లభిస్తుందంటారు. దానధర్మాలు గోప్యంగా చేసినవాటికి ఎక్కువ ఫలితాలు ఉంటాయి. వాంఛలు పెంచే ఉల్లి, వెల్లుల్లి, మద్యం, మాంసానికి దూరంగా ఉండాలి. ఈ మాసంలో అత్యంత పుణ్య రోజులైన ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, సోమవారాలలో నిమయ నిష్టలతో పూజ చేస్తే అనంత కోటి పుణ్యఫలితాలు దక్కుతాయి. ఒక్క సోమవారం అయినా నియమ నిష్టలతో ఉపవాసం చేసిన దేవాలయంలో దీపం వెలిగించి ఆకాశ దీపాన్ని చూస్తే కోటి పుణ్యాలు సిద్ధిస్తాయని నమ్మకం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+