అనురాధ హత్య: మీడియా ముందుకు ముగ్గురు, నిందితులు వీరే..
చిత్తూరు: మేయర్ కటారి అనురాధ దంపతుల హత్యకేసులో ముగ్గురు నిందితులను మంగళవారం పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. లొంగిపోయిన నిందితులు వెంకటాచలపతి, జయప్రకాశ్‌రెడ్డి, మంజునాథ్‌లను పోలీసు అధికారులు మీడియా ఎదుట హాజరుపరిచారు.
కటారి దంపతుల హత్యకేసులో 11 మంది నిందితులను గుర్తించినట్లు జిల్లా ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ తెలిపారు. త్వరలోనే నిందితులందరినీ పట్టుకుంటామన్నారు. మరో నిందితుడు మురుగన్ మంగళవారం పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం.కేసులో ప్రధాన నిందితుడు చంద్రశేఖర్ అలియాస్ చింటూ ఇంకా పరారీలోనే ఉన్నాడని, అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని ఎస్పీ చెప్పారు.

ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం - కటారి మోహన్‌కు, ఆయన మేనల్లుడు చింటూకు మధ్య ఏడాదిగా మనస్పర్థలున్నాయి. వీరిద్దరికీ చెందిన క్వారీలో సైతం గొడవలు చోటు చేసుకున్నాయి. దీంతో పాటు చిత్తూరు కార్పోరేషన్ కార్యాలయంలో చింటూకు చెందిన సివిల్, ఇతర టెండర్లు, బిల్లులు ఇవ్వడం లేదని మేయర్ అనురాధపై, మోహన్‌పై చింటూ పగ పెంచుకున్నాడు. తనను రాజకీయంగా కూడా అణచివేస్తున్నారని భావించిన చింటూ అనరురాధ దంపతులపై తీవ్రమైన కక్ష పెంచుకున్నాడు.
అనురాధ హత్య కేసులో ప్రాథమికంగా 11 మందిపై కేసులు నమోదు చేశారు. వీరిలో ప్రధాన నిందితుడిగా చింటూ ఉన్నాడు. మిగతా నిందితులు వెంకటాచలపతి, జయప్రకాష్, మంజునాథ్, మురగన్, యోగ, పరంధామ, హరిదాస్, మొగలి, శశిధర్‌లు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వారు వాడిన కత్తులను, తుపాకీలను, వాహనాలను, బురఖాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications