వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శిల్పా బ్రదర్స్ ఎఫెక్ట్, జగన్ క్లాస్: వైసిపికి కాటసాని ఝలక్, అల్లుడి వైపే?

శిల్పా చక్రపాణి రెడ్డిని చేర్చుకుంటున్న వైసిపికి ఆ పార్టీ బనగానపల్లి ఇంచార్జ్ కాటసాని రామిరెడ్డి ఝలక్ ఇవ్వనున్నారని తెలుస్తోంది.

|
Google Oneindia TeluguNews

నంద్యాల: శిల్పా చక్రపాణి రెడ్డిని చేర్చుకుంటున్న వైసిపికి ఆ పార్టీ బనగానపల్లి ఇంచార్జ్ కాటసాని రామిరెడ్డి ఝలక్ ఇవ్వనున్నారని తెలుస్తోంది.

'జగన్ కడపలో బాబాయిని గెలిపించలేదు కానీ', రెండోసారి.. బాబుకు శిల్పా చేయి'జగన్ కడపలో బాబాయిని గెలిపించలేదు కానీ', రెండోసారి.. బాబుకు శిల్పా చేయి

నంద్యాల ఉప ఎన్నికలో టికెట్‌ను శిల్పా మోహన్ రెడ్డికి ఇవ్వడంతో టికెట్ పై ఆశలు పెట్టుకున్న వైసిపి నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎన్నికల బరిలో వైసిపి తరపున రాజగోపాల్ రెడ్డి ఉంటారని గతంలో కాటసాని ప్రకటించారు.

శిల్పాకు టిక్కెట్.. రామిరెడ్డి షాక్

శిల్పాకు టిక్కెట్.. రామిరెడ్డి షాక్

అయితే, టిడిపిని వీడి వైసిపిలో చేరిన శిల్పా మోహన్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో ఆయన షాకయ్యారని అంటున్నారు. వాస్తవానికి నంద్యాల ఎన్నికను ఏకగ్రీవం చేయాలని కాటసాని మొదట్లో ప్రయత్నించారని చెబుతున్నారు.

Recommended Video

Silpa Chakrapani Reddy Visits Srisailam Temple - Oneindia Telugu
క్లాస్ తీసుకున్న జగన్

క్లాస్ తీసుకున్న జగన్

దీంతో ఆయనకు అధినేత జగన్ క్లాస్ తీసుకున్నారని ప్రచారం సాగుతోంది. దీంతో, కాటసాని తీవ్ర మనస్తాపానికి గురయ్యారని అంటున్నారు. అంతేకాదు, ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన పాల్గొనడం లేదని చెబుతున్నారు.

దూరం పాటిస్తున్న కాటసాని రామిరెడ్డి.. అల్లుడికే మద్దతు

దూరం పాటిస్తున్న కాటసాని రామిరెడ్డి.. అల్లుడికే మద్దతు

పార్టీకి చెందిన నేతలను కూడా కాటసాని కలవడం లేదంటున్నారు. మరోవైపు, తన కుమార్తె కోరిక మేరకు ఆయన తన అల్లుడైన టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డికి మద్దతు తెలుపుతున్నారని అంటున్నారు.

జగన్ పర్యటనలో ఉంటారా?

జగన్ పర్యటనలో ఉంటారా?

గురువారం జగన్ నంద్యాలలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో జగన్ ఉంటారా లేదా అనే చర్చ సాగుతోంది. ఏదేమైనా కాటసాని వైసిపికి దూరం జరుగుతున్నారనే ప్రచారం సాగుతోంది.

English summary
It is said that YSR Congress Party Banaganapalli incharge Katasani Rami Reddy unhappy with party chief YS Jaganmohan Reddy over Nandyal bypoll issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X