అంతా మీ పార్టీ వాళ్లేగా, అవి పంచుకున్న బ్యాచ్ ఎక్కడ?: టీడీపీ నేతలపై కత్తి మహేష్ సంచలనం
హైదరాబాద్: సినీ విమర్శకుడు కత్తి మహేష్.. ఈసారి టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం పోరాటంలో సినీ పరిశ్రమ కలిసిరావడం లేదంటూ.. అసలు సినీ పరిశ్రమకు ఏమైందంటూ టీడీపీ నేత రాజేంద్ర ప్రసాద్ చేసిన విమర్శలపై కత్తి మహేశ్ ఘాటుగా స్పందించారు.
'ఏపీ ప్రత్యేక హోదా కోసం అన్నీ వర్గాల వారు మద్దతు ఇస్తుంటే సినీ పరిశ్రమ ఎందుకు ముందుకు రావడం లేదు. తమిళనాడులో జల్లికట్టు ఉద్యమాన్ని అక్కడి పరిశ్రమ ముందుండి నడిపించింది. తెలుగు చిత్రపరిశ్రమకు చేవ చచ్చిపోయిందా? పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంపీ కవిత, మంత్రులంతా మద్దతు ఇస్తుంటే.. సినీ ప్రముఖులకు ఏమైంది?' అని రాజేంద్రప్రసాద్ పేర్కొన్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో శివాజీ, పవన్ కళ్యాణ్, నిఖిల్ సిద్దార్థ, సంపూర్ణేష్ బాబు, తమ్మారెడ్డి భరద్వాజ, మంచు మనోజ్, కొరటాల శివ, తాను అంతకుముందే ప్రత్యేక హోదా గురించి మాట్లాడామని, ఉద్యమాలలో పోరాడామని అన్నారు. నిన్నటికి నిన్న కళ్ళు తెరిచి హోదా రాగం ఎత్తుకున్న టీడీపీ నాయకులకు కళ్ళు నెత్తికెక్కినట్టు ఉన్నాయంటూ కత్తి మహేష్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
సినీ పరిశ్రమను అనవసరంగా బదనాం చేయొద్దని, మాటలు జాగ్రత్త! అని ట్విట్టర్ వేదికగా హెచ్చరించారు. 'ఉన్న హీరోలందరూ ఏదో ఒక రకంగా మీ పార్టీకి సంబంధించిన వాళ్లేగా! బాలకృష్ణ ఒక్కరు చాలరా? అవార్డులు పంచుకున్న బ్యాచ్ ఎక్కడ? మీరు వైజాగ్‌లో భూములు ఇచ్చిన స్టార్లు ఎక్కడ? బొడ్డు, జఘనాల డైరెక్టర్ తిరుమలలోనే ఉన్నారుగా? బోయపాటి శీను ఎక్కడా?' అంటూ తన ట్వీట్‌లో కత్తి మహేష్ ప్రశ్నలు గుప్పించారు.
శివాజీ.పవన్ కళ్యాణ్. నిఖిల్ సిద్దార్థ. సంపూర్ణేష్ బాబు. తమ్మారెడ్డి భరద్వాజ.మంచు మనోజ్. కొరటాల శివ. నేను ఆల్రెడీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడాము. ఉద్యమాలలో పోరాడాము. నిన్నటికి నిన్న కళ్ళు తెరిచి హోదారాగం ఎత్తుకున్న టిడిపి నాయకులు కళ్ళు నెత్తికెక్కినట్టు ఉన్నాయి. మాటలు జాగ్రత్త!
— Kathi Mahesh (@kathimahesh) March 20, 2018
ఉన్న హీరోలందరూ ఎదో ఒక రకంగా మీ పార్టీకి సంబంధించిన వాళ్లేగా! బాలకృష్ణ ఒకరు చాలడా?అవార్డులు పంచుకున్న బ్యాచ్చి ఎక్కడ? మీరు వైజాగ్ లో భూములు ఇచ్చిన స్టార్లు ఎక్కడ?బొడ్డు, జఘనాల డైరెక్టర్ తిరుమలలోనే ఉన్నారుగా?బోయపాటి శీను ఎక్కడా?https://t.co/UBIESLernR
— Kathi Mahesh (@kathimahesh) March 20, 2018
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications