బిజెపి చంద్రబాబు జేబు పార్టీ: కల్వకుంట్ల కవిత వ్యాఖ్య

బిజెపికి ఓటు వస్తే చంద్రబాబుకు ఓటు వేసినట్లేనని వ్యాఖ్యానించారు. సీమాంద్రుల పెట్టుబడిదారులు డబ్బు సంచులతో వచ్చి తెలంగాణ ఎన్నికల్లో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. రైతులు కరెంటు ఇవ్వమని అడిగితే చంద్రబాబు హైదరాబాద్ నగర నడిబొడ్డున రైతులను కాల్చి చంపించిన ఘనత ఆయనదని కవిత ఘాటుగా విమర్శించాచంద్రబాబుది అని ఆయన అన్నారు.
బిజెపి, టిడిపి మధ్య పొత్తు వద్దని రెండు పార్టీల వైపుల నుంచి కొంత మంది నేతలు ఒత్తిడి తీసుకువచ్చినా చంద్రబాబు, వెంకయ్యనాయుడు పట్టించుకోలేదని, వారు పొత్తులతో ముందుకు వచ్చారని, తెలంగాణ ప్రజలు అందరూ సమీక్షించి, ఆలోచించాలని కవిత అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కూతురు కల్వకుంట్ల కవిత నిజామాబాద్ లోకసభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆమెపై తెలుగుదేశం పార్టీ మద్దతుతో బిజెపి అభ్యర్థి యెండల లక్ష్మినారాయణ, కాంగ్రెసు నుంచి మధుయాష్కీ పోటీలో ఉన్నారు.












Click it and Unblock the Notifications