వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేడు ఇద్దరు చంద్రులూ ఒకే చోటకు : నాటి బంధాలు గుర్తు చేసుకుంటూ..!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ - టీడీపీ అధినేత చంద్రబాబు ఇద్దరూ ఈ రోజు ఉత్తర ప్రదేశ్ వెళ్తున్నారు. రాజకీయ దిగ్గజం ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియల్లో ఇద్దరు నేతలు పాల్గొంటారు. ములాయం తో
సుదీర్ఘ కాలంగా చంద్రబాబుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కొంత కాలంగా జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ములాయం, ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్ తో రాజకీయంగా సత్సంబంధాల ను కొనసాగించారు.

ములాయం - చంద్రబాబు సుదీర్ఘ రాజకీయం

ములాయం - చంద్రబాబు సుదీర్ఘ రాజకీయం

టీడీపీ అధినేత చంద్రబాబు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా చంద్రబాబు 1996-199 మధ్య కాలంలో జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆ సమయంలోనే ఉత్తర ప్రదేశ్ లో బలమైన నేతగా ఉన్న ములాయం యాదవ్ కేంద్రంలో కీలకంగా మారారు. ప్రధానుల ఎంపిక విషయంలో నాడు చంద్రబాబు - ములాయం ప్రధాన భూమిక పోషించారు. ప్రధానులుగా ఐకే గుజ్రాల్ - దేవగౌడ ఎంపిక సమయం లో చోటు చేసుకున్న క్రమంలో ఈ ఇద్దరి నేతల నిర్ణయాలకే కీలకంగా మారాయి. ఆ సమయం నుంచి చంద్రబాబు - ములాయం మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. రాజకీయంగా ఎవరి దారిలో వారు నిర్ణయాలు..ప్రయాణం సాగినా.. ఇద్దరి మధ్య వ్యక్తిగతంగా ఆ సంబంధాలు కొనసాగాయి.

నాటి జాతీయ రాజకీయాల్లో కీలకంగా

నాటి జాతీయ రాజకీయాల్లో కీలకంగా

ఇక, కేసీఆర్ కేంద్రంలో బీజేపీ లక్ష్యంగా రాజకీయ పోరాటం ప్రారంభించారు. ఇందులో యూపీ మాజీ సీఎం అఖిలేష్ మద్దతు ప్రకటించారు. అఖిలేష్ హైదరాబాద్ లో కేసీఆర్ తోనూ సమావేశాలు నిర్వహించారు. ఇక, తాజాగా విజయదశమి నాడు అఖిలేష్ హైదరాబాద్ లో కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు హాజరు కావాల్సి ఉంది. అయితే, అప్పటికే ములాయం ఆస్పత్రిలో చేరటంతో ఆయన్ను రావద్దని తానే సూచించినట్లుగా కేసీఆర్ వెల్లడించారు. ములాయం మరణం పట్ల సంతాపం ప్రకటించారు. నేడు సీఎం కేసీఆర్ - మంత్రి తలసానితో కలిసి ములాయం అంత్యక్రియలను హాజరు కానున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా అంత్యక్రియలను హాజరు కావాలని నిర్ణయించారు.

కేసీఆర్ - చంద్రబాబు హాజరు

కేసీఆర్ - చంద్రబాబు హాజరు

2014లో రాష్ట్ర విభజన తరువాత చోటు చేసుకున్న పరిణామాలు - నాటి ఏపీ సీఎంగా చంద్రబాబు తన పరిపాలన హైదరాబాద్ నుంచి అమరావతికి మార్చిన ఇద్దరూ ఏ సందర్బంలోనూ కలవలేదు. ఇప్పుడు ఇద్దరూ ములాయం అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్తున్నారు. చంద్రబాబు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లి అక్కడి నుంచి ములాయం స్వగ్రామం సైఫాయిలో జరిగే అంత్యక్రియలకు హాజరవుతారు. అనంతరం తిరిగి ఢిల్లీ చేరుకుని.. రాత్రికి విజయవాడకు బయలుదేరుతారు. చంద్రబాబు నాటి సంకీర్ణ రాజకీయాల్లో ములాయంతో కలిసి జాతీయ రాజకీయాల్లో పోషించిన పాత్ర పైన పార్టీ నేతలతో పంచుకున్నారు. దీంతో..ఇప్పుడు ఇద్దరు చంద్రులు ములాయం అంత్యక్రియలకు హాజరు కానున్నారు.

English summary
Telangana CM KCR and TDP Chief Chandra Babu to attned Mulayam Sing yadav Final rites in his own village in UP today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X