హైకోర్టు మాకే, ఎపికి వేరే చేయండి: దత్తుతో కెసిఆర్

న్యూఢిల్లీ: తెలంగాణ ము ఖ్యమంత్రి కెసిఆర్‌ శుక్రవారం నూఢిల్లీలో సుప్రీం కోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్‌ హెచ్‌ఎల్‌ దత్తుతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు విభజన అంశంపై చర్చించినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా వేరే హైకోర్టును ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న హైకోర్టును తెలంగాణకే కేటాయించాలని కోరినట్లు సమాచారం.

ఒకే కోర్టును ఇరు రాష్ట్రాలు ఉపయెగించటం ఇబ్బందికరమని చెప్పినట్లు తెలిసింది. అలాగే రెండు టివి ఛానెళ్ళ ప్రసారాలు తెలంగాణలో నిలిపివేసిన అంశం కూడా ప్రస్తావన వచ్చినట్లు తెలిసింది. హైకోర్టుతో పాటు కొన్ని కీలకమైన కేసులకు సంబంధించి కూడా సిఎం కెసిఆర్‌, ప్రధాన న్యాయమూర్తి దత్తుల మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో ముఖ్యమంత్రి జరిపిన సమావేశానికి తెలంగాణ ఇంటలిజెన్స్ విభాగం ప్రధానాధికారి శివధర్‌రెడ్డి, ముఖ్య కార్యదర్శి నరసింగరావు హాజరయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం సచివాలయంలో రెండు రాష్ట్రాల కార్యాలయాలు, ముఖ్యమంత్రి కార్యాలయాలు సజావుగా పని చేస్తున్నాయి, ఇదేవిధంగా హైకోర్టు ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఏర్పాటు చేయవచ్చునని చంద్రశేఖరరావు సూచించినట్లు తెలిసింది.

K Chandrasekhar Rao

రెండు రాష్ట్రాలకు ఒకే హైకోర్టు ఉండటం వలన పలు సాంకేతికపరమైన సమస్యలు ఎదురవుతున్నాయని, తెలంగాణ అడ్వకేట్లు సరిగా పని చేయలేకపోతున్నారని ఆయన చెప్పారని అంటున్నారు. కేసుల పరిష్కారం కూడా ఒక సమస్యగా మారిందని చెప్పినట్లు తెలిసింది. ఆంధ్రప్రాంతంలో ప్రత్యేక హైకోర్టును వెంటనే ఏర్పాటు చేయటం సాధ్యం కాని పక్షంలో ప్రస్తుత హైకోర్టు ఆవరణలోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఏర్పాటు చేసేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారని ఆంటున్నారు చంద్రశేఖరరావు గతంలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను కలిసినప్పుడు కూడా ఈ ప్రతిపాదన చేయటం తెలిసిందే.

కాగా, కెసిఆర్‌ మరో మూడు రోజుల పాటుఢిల్లీలోనే ఉండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, న్యాయమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌, విద్యుత్‌ మంత్రి పీయూష్‌ గోయల్‌, మానవవనరుల మంత్రి సృ్మతి ఇరానీ, కేంద్ర వాణిజ్యమంత్రి నిర్మలా సీతారామన్‌లతో తెలంగాణలోని సమస్యలపై చర్చించనున్నట్లు తెలిసింది.

తెలంగాణలో ప్రస్తుతం తీవ్రమైన విద్యుత్‌ కోత ఉన్న నేపథ్యంలో పరిశ్రమలకు కూడా విద్యుత్‌ హాలిడేను ప్రకటించిన విషయం విదితమే. మిగులు విద్యుత్‌ను తమకు కేటాయించాలని కేంద్రాన్ని సిఎం కెసిఆర్‌ కోరనున్నారు. అలాగే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రత్యేక హోదా అంశంపై కూడా సిఎం చర్చించనున్నట్లు తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+