టీ తొలి సిఎం: టిఆర్ఎస్ఎల్పీ నేతగా కెసిఆర్ (పిక్చర్స్)

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా పక్ష నేతగా పార్టీ అధ్యక్షుడు, మెదక్ జిల్లా గజ్వెల్ శాసనసభ్యుడు కె. చంద్రశేఖర రావు ఎన్నికయ్యారు. తెరాస శాసనసభ్యులు ఆయనను తమ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శనివారంనాడు జరిగిన సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. మీడియా సమావేశంలో రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు ఈ విషయాన్ని ప్రకటించారు.

కెసిఆర్ పేరును శాసనసభ్యుడు రాజయ్య ప్రతిపాదించారు. తామంతా బలపరిచామని ఈటెల రాజేందర్ మీడియా సమావేశంలో చెప్పారు. తొలి ముఖ్యమంత్రిగా దళిత నేతను చేస్తానని హామీ ఇస్తూ వచ్చిన కెసిఆర్ చివరకు తానే ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలనే నిర్ణయానికి వచ్చారు.

తెలంగాణను అభివృద్ధి మార్గంలో నడిపించాలంటే కెసిఆర్ ముఖ్యమంత్రి కావాలంటూ ఒత్తిడి వచ్చింది. కెసిఆర్‌ను దళిత శాసనసభ్యులు బలపరచడం ద్వారా గతంలోని హామీకి భిన్నంగా పోవడం వల్ల ఎదురయ్యే విమర్శలను తిప్పికొట్టినట్లవుతుందని భావిస్తున్నారు. కెసిఆర్‌ను ఎన్నుకున్న విషయాన్ని పార్టీ రాజ్యసభ సభ్యుడు మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రకటించారు. పార్లమెంటరీ పార్టీ నేత ఎన్నిక బాధ్యత కెసిఆర్‌దేనని కెకె అన్నారు.

శాసనసభ్యులు ఇలా..

శాసనసభ్యులు ఇలా..

శాసనసభా పక్ష సమావేశంలో తెలంగాణలో ఎన్నికైన తెరాస శాసనసభ్యులు ఇలా కనిపించారు.

పద్మారావును వాటేసుకున్న కెసిఆర్

పద్మారావును వాటేసుకున్న కెసిఆర్

శాసనసభకు ఎన్నికైన పద్మారావును తెరాస అధినేత కె. చంద్రశేఖర రావు వాటేసుకుని అభనందించారు.

కెసిఆర్‌కు అభినందన

కెసిఆర్‌కు అభినందన

ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ప్రచారం నిర్వహించి పార్టీని విజయపథంలో నడిపించిన కెసిఆర్‌ను అభినందిస్తూ తీర్మానం చేశారు.

కవిత ఇలా కనిపించారు..

కవిత ఇలా కనిపించారు..

శాసనసభా పక్ష సమావేశంలో నిజామాబాద్ లోకసభ స్థానం నుంచి ఎన్నికైన కల్వకుంట్ల కవిత ఇలా కనిపిచారు.

రేపు గవర్నర్‌తో భేటీ

రేపు గవర్నర్‌తో భేటీ

కెసిఆర్ శాసనసభా పక్ష నేతగా ఎంపిక చేసుకున్న నేపథ్యంలో తెరాస నాయకులు రేపు గవర్నర్ నరసింహన్‌ను కలవనున్నారు.

ఆడంబరాలకు దూరం..

ఆడంబరాలకు దూరం..

వేడుకలకు, ఆడంబరాలకు దూరంగా ఉండాలని కూడా తెరాస శాసనసభా పక్ష సమావేశం తీర్మానం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+