వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ ఫ్లైట్ లేట్: హైదరాబాద్ ర్యాలీలో మార్పులు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కే.చంద్రశేఖరావు వచ్చే విమానంలో జాప్యం జరిగే అవకాశాలున్నాయి. దీంతో హైదరాబాద్‌లో తలపెట్టిన విజయోత్సవ ర్యాలీలో మార్పులు చేశారు. బుధవారం హైదరాబాద్ వస్తున్ారు. ఈ క్రమంలో ఢిల్లీ నుండి బయల్దేరాల్సిన ఆయన విమానం ఆలస్యం అయిననట్లు తెలుస్తోంది.

షెడ్యూల్ ప్రకారం బుధవారం మధ్యాహ్నం 1:45 నిమిషాలకు కెసిఆర్ ఢిల్లీ నుండి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోవాల్సుంది. అక్కడి నుండి బేగంపేటకు హెలికాప్టర్‌లో బయల్దేరి 2 నుండి 2-30 గంటల మధ్య ఆయన ర్యాలీ ప్రారంభం కావాలి. కానీ ఢిల్లీలో ఆయన బయల్దేరాల్సిన విమానం ఆలస్యం కారణంగా మధ్యాహ్నం 2:45 గంటలకు కెసిఆర్ శంషాబాద్ విమానాశ్రయంకు చేరుకునే అవకాశముందని సమాచారం.

K Chandrasekhar Rao

దీంతో సాయంత్రం 4గంటలకు బేగంపేట విమానాశ్రయం నుండి ఆయన ర్యాలీ ప్రారంభమయ్యే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బేగంపేట నుండి టీఆర్ఓస్ కార్యకర్తలు, తెలంగాణ వాదులతో విజయోత్సవ ర్యాలీలో కేసీఆర్ పాల్గొంటారు. అక్కడనుండి గన్‌పార్క్ వరకు ఆయన ర్యాలీ కొనసాగుతుంది.

గన్‌పార్క్ చేరుకున్న ఆయన అక్కడ అమరవీరుల శ్ధూపాలకు ఘన నివాళులు అర్పిస్తారు. తర్వాత అక్కడ నుండి తెలంగాణ భవన్‌కు చేరుకుని తెలంగాణ తల్లి విగ్రహానికి, అలాగే ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల వేస్తారు. అనంతరం ఇంటికి బయల్దేరుతారు.

ఇప్పటికే వివిధ జిల్లాల నుండి వేల సంఖ్యలో కెసిఆర్ అభిమానులు, తెరాస కార్యకర్తలు హైదరాబాద్‌కు చేరుకున్నారు. సాయంత్రం కెసిఆర్ వచ్చేలోపు ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ స్థితిలో నగర పోలీసు శాఖ పటిష్ఠ భద్రతా చర్యలు చేపడుతున్నారు. కెసిఆర్ ర్యాలీ సందర్భగా తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ను మూసివేయనున్నారు.

English summary
Telangana Rastra Samithi (TRS) president K Chandrasekhar Rao's victory rally will be changed, as his flight from Delhi to Hyderabad is delayed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X