హైద్రాబాద్‌పై కెసిఆర్: చిరు వాదన, వారికి రాహుల్ నో

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ ముసాయిదా బిల్లు) రేపు లోకసభలో ఆమోదం పొందుతుందని కెసిఆర్ అన్నారు. హైదరాబాదును ఐదేళ్ల పాటు కేంద్రపాలిత ప్రాంతం చేసే ప్రతిపాదనల పైన కేంద్రమంత్రి, జివోఎం సభ్యులు జైరామ్ రమేష్ తనతో చర్చలు జరిపారని తెలిపారు.
హైదరాబాదును యూటికి తాము ఎట్టి పరిస్థితుల్లోను అంగీకరించేది లేదని చెప్పానన్నారు. తెరాస విలీనం పైన కూడా చర్చ జరిగిందని, ఆంక్షలు లేని బిల్లుకు ఆమోదం లభిస్తే దేనికైనా తాను సిద్ధమని చెప్పాననని అన్నారు. హైదరాబాదు పైన ఆంక్షలు విధించే దిశలో కాంగ్రెసు పార్టీ ఆలోచన చేస్తోందన్నారు. ఆంక్షలు లేని తెలంగాణ ఇస్తేనే తాను విలీనానికైనా సై అన్నట్లు చెప్పారు.
రాహుల్‌కు చిరు విజ్ఞప్తి
మరోవైపు ఈ రోజు రాత్రి ఏడున్నర గంటలకు సీమాంధ్ర కేంద్రమంత్రులతో ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ భేటీ కానున్నారు. ఈ భేటీకి రావాలంటూ సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలకు రాహుల్ ఫోన్ చేసి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో మాట్లాడిన కేంద్రమంత్రి చిరంజీవి హైదరాబాద్ యూటిపై రాహుల్‌కు విజ్ఞప్తి చేస్తామన్నారు. బహిష్కృత ఎంపీలను రాహుల్ గాంధీ పిలువలేదు.
కాంగ్రెసు ఎంపీలకు విప్
కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులకు విప్ జారీ చేశారు. రేపటి నుండి బిల్లు పైన లోకసభలో చర్చ జరగనున్న నేపథ్యంలో విప్ జారీ చేయడం గమనార్హం.












Click it and Unblock the Notifications