కెసిఆర్ కేబినెట్లో వీరేనా: హోంపై హరీష్ ఆసక్తి, ఈటెలకు?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు నేతృత్వంలో తెరాస ఎమ్మెల్యేలు ఆదివారం మధ్యాహ్నం గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. తెరాస ఎల్పీ తీర్మానాన్ని వారు గవర్నర్‌కు ఇచ్చారు. కెసిఆర్‌ను ఎల్పీగా తెరాస ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. గవర్నర్‌ను కలిసిన అనంతరం ఈటెల రాజేందర్ విలేకరులతో మాట్లాడుతూ... వచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చడం తెరాస, కెసిఆర్ వల్లే సాధ్యమని నమ్మి ప్రజలు తమకు పట్టం కట్టారన్నారు.
కెసిఆర్ కేబినెట్లో వీరే!
కెసిఆర్ తన కేబినెట్ పైన కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. జూన్ 2వ తేదీ తర్వాత కెసిఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అపాయింటెండ్ డేట్‌ను ముందుకు జరపాలని తెరాస కోరుతోంది. వారి కోరిక నిజమైతే కెసిఆర్ ఇంకాస్త ముందుగానే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది. లేదంటే జూన్ 2 లేదా ఆ తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తారు.

ఈ నేపథ్యంలో కెసిఆర్ మంత్రివర్గం పైన కసరత్తు చేస్తున్నారు. మైనార్టీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని ప్రచారం సమయంలో చెప్పారు. ఈ నేపథ్యంలో మహ్మద్ అలీకి ఆ పదవిని కట్టబెట్టవచ్చు. దళితులకు ముఖ్యమంత్రి పదవి అని చెప్పినప్పటికీ ఆ తర్వాత వెనక్కి వెళ్లారు. దీంతో వారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి చల్లబరిచే అవకాశాలున్నాయంటున్నారు. అదే జరిగితే కొప్పుల ఈశ్వర్‌ను వరించనుంది.
ఈటెల రాజేందర్‌కు హోంమంత్రిత్వ శాఖ అప్పగించవచ్చునని చెబుతున్నారు. హరీష్ రావుకు భారీ నీటిపారుదల, వ్యవసాయ శాఖను ఇచ్చే అవకాశాలున్నాయంటున్నారు. అయితే హరీష్ రావు హోంశాఖను ఆశిస్తున్నారట. మెదక్ జిల్లా నుండి బాబుమోహన్‌కు మంత్రిగా అవకాశానికి ఛాన్స్ ఉంది. సోలిపేట రామలింగారెడ్డి కూడా రేసులో ఉన్నారు.
అదిలాబాద్ జిల్లా నుండి నల్లాల ఓదేలు, జోగు రామన్న, నిజామాబాద్ జిల్లా నుండి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డిలలో ఒకరికి అవకాశముంది.
పోచారం శ్రీనివాస్‌కు స్పీకర్ ఛాన్స్ ఉందంటున్నారు. హైదరాబాదులో తెరాస తరఫున గెలిచిన పద్మారావుకు ఓ శాఖ దక్కే అవకాశముంది. రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి, మహబూబ్ నగర్ నుండి జూపల్లి లేదా శ్రీనివాస్ గౌడ్‌లు రేసులో ఉన్నారు. జగదీశ్వర్ రెడ్డి, గొంగిడి సునీత, కొండా సురేఖ, సిరికొండ మదుసూధనా చారి, తాడికొండ రాజయ్య వంటి వారు మంత్రి పదవులు ఆశిస్తున్నారు.












Click it and Unblock the Notifications