పనిలేని నేతలే రెండో రాజధాని అంటున్నారు: కేఈ మండిపాటు
కర్నూలు: కొందరు పనిలేని నేతలే కర్నూలును రెండో రాజధాని చేయాలని అంటున్నారని ఉపముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలతో మహిళలు అభివృద్ధి బాట పట్టారన్నారు.
ప్రజలకిచ్చిన అన్ని హామీలను తెలుగుదేశం ప్రభుత్వం నెరవేరుస్తుందని డిప్యూటీ సిఎం కృష్ణమూర్తి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పారు.

వరద ముంపు గ్రామాల్లో మంత్రి ప్రత్తిపాటి, సోమిరెడ్డి పర్యటన
మనుబోలు వరద ముంపు గ్రామాల్లో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సోమవారం పర్యటించారు. కటువాపల్లిలో వరదలకు గల్లంతైన ఆక్వా రైతు కుటుంబానికి 5 లక్షలరూపాయల పరిహారం అందించారు.
ప్రజలు ఎటువంటి ఆందోళనలకు గురికావాల్సిన అవసరంలేదని ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని మంత్రి ప్రత్తిపాటి, ఎమ్మెల్సీ సోమిరెడ్డి భరోసానిచ్చారు.
స్వయం ఉపాధితో ద్వారా ఆర్థిక స్థితి మెరుగు
స్వయం ఉపాధి ద్వారా ఆర్ధిక స్థితి మెరుగవుతుందని ఏపి మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. నర్సీపట్నం ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం మహిళల కోసం ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రామీణ మహిళలు ఈ స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా శిక్షణ తీసుకుని స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications