బాబుకు ఝలక్: బెజవాడపై కెఈ సంచలన వ్యాఖ్యలు

KE Krishna murthy unhappy with Vijayawada as capital
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఝలక్ ఇచ్చారు. విజయవాడ - గుంటూరు మధ్య రాజధానిని ఏర్పాటు చేయాలనే ఆలోచనపై ఆయన మంగళవారంనాడు తీవ్రంగా స్పందించారు. మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ తన అసంతృప్తి వ్యక్తం చేశారు. కర్నూలును రాష్ట్ర రాజధానిగా చేయాలనే డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కెఈ కృష్ణమూర్తి ప్రకటన ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. కెఈ కృష్ణమూర్తి కర్నూలు జిల్లాకు చెందినవారే.

విజయవాడ ఇరుకైన నగరమని ఆయన అన్నారు. విజయవాడ, గుంటూరు మధ్య కేవలం 500 ఎకరాల ప్రభుత్వ భూమి మాత్రమే అందుబాటులో ఉందని ఆయన అన్నారు. విజయవాడ తాత్కాలిక రాజధాని మాత్రమే గానీ శాశ్వత రాజధాని కాదని ఆయన అన్నారు. కర్నూలు జిల్లాలో 30 వేల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని ఆయన చెప్పారు.

ప్రతి జిల్లా కేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న భూమి వివరాలు సేకరించామని ఆయన చెప్పారు. నెల్లూరు జిల్లా కేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలో మిగతా అన్ని జిల్లా కేంద్రాలతో పోలిస్తే ఎక్కువ ప్రభుత్వ భూమి ఉందని చెప్పారు. ఆ తర్వాత స్థానాలు కర్నూలు, అనంతపురం ఆక్రమిస్తాయని చెప్పారు.

ఏ జిల్లా కేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలో ఎంతెంత ప్రభుత్వ భూమి ఉందనే విషయాలను కూడా ఆయన వెల్లడించారు. కృష్ణా జిల్లా కేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలో కేవలం 3,247 ఎకరాల భూమి మాత్రమే ఉంది. నెల్లూరు జిల్లా కేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలో 5,823 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. కర్నూలు జిల్లా కేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలో 5 వేల ఎకరాల భూమి అందుబాటులో ఉందని కెఈ కృష్ణమూర్తి చెప్పారు.

నారాయణపై విసుర్లు

ఆంధ్రప్రదేశ్ రాజధాని పై పదే పదే ప్రకటనలు చేస్తున్న మున్సిపల్ శాఖ మంత్రి నారాయణపై కెఈ కృష్ణమూర్తి విరుచుకుపడ్డారు. విజయవాడను రాజధానిగా చేస్తామని నారాయణ పదే పదే ప్రకటనలు చేస్తున్నారని, దానివల్ల అక్కడ భూముల ధరలు పెరుగుతున్నాయని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+