అవినీతిని నిరూపిస్తే కేబినెట్ రాజీనామా, జగన్ ఎప్పటికీ సీఎం కాలేడు: కేఈ
దశాబ్దాలపాటుట తలకిందులుగా తపస్సుచేసినా వైసీపీ అధినేత జగన్ ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడని ఏపీ డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి ఎద్దేవా చేశారు. ఆదివారంనాడు ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాజు క
కర్నూల్: దశాబ్దాలపాటుట తలకిందులుగా తపస్సుచేసినా వైసీపీ అధినేత జగన్ ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడని ఏపీ డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి ఎద్దేవా చేశారు.
ఆదివారంనాడు ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాజు కొడుకు రాజు అవడం సమంజసమే కానీ, ప్రజాస్వామ్యంలో ప్రజాభిమానం , అనుభవం లేకుండా మాజీ ముఖ్యమంత్రి కొడుకుగా సీఎం కావాలనుకోవడం గాలిమేడలు కట్టడమేనని చెప్పారు.

పదే పదే రాజన్న పాలన తెస్తామని వైసీపీ చెబుతోందన్నారు. గనుల దోపిడి, భూ కబ్జాలు, లక్షలకోట్లు అవినీతి మళ్ళీ తీసుకురావడమేనా అని ఆయన విమర్శించారు.చంద్రబాబుపై విమర్శలే లక్ష్యంగా ప్లీనరీని నిర్వహించారన్నారు.
ప్రజాప్రయోజన కార్యక్రమాలు, రాష్ట్రాభివృద్ది, ప్రత్యేక ప్యాకేజీపై చర్చించాలని ఆయన హితవు పలికారు.చంద్రబాబుపై చేసిన లక్షల కోట్ల అవినీతి ఆరోపణలను నిరూపిస్తే కేబినెట్ మొత్తం రాజీనామా చేస్తామని కేఈ సవాల్ విసిరారు.
దశాబ్దాలపాటు తలకిందులుగా తపస్సుచేసినా జగన్ సిఎం కాలేడని డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి చెప్పారు.
లక్షలకోట్ల అవినీతి, గనుల దోపిడిని తీసుకోనిరావడమేనా రాజన్న రాజ్యమా అని ఆయన ప్రశ్నించారు.
చంద్రబాబుపై అనినీతి ఆరోపణలు నిరూపిస్తే కేబినెట్ మొత్తం రాజీనామా చేస్తామని ఆయన సవాల్ విసిరారు.












Click it and Unblock the Notifications