జగన్ ఇచ్చిన షాకా?: అసెంబ్లీలో కోపంతో పేపర్లు విసిరిన కేఈ కృష్ణమూర్తి, బాబే చేయాలి
హైదరాబాద్: ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి సోమవారం కోపం వచ్చింది. ఆయన తీవ్ర అసహనానికి లోనయ్యారు. అసైన్‌మెంట్ కమిటీపై ఎమ్మెల్యేలు నిలదీయటంతో ఆయన అసహనానికి లోనయ్యారు.
Recommended Video


చేతిలోని పేపర్లను విసిరికొట్టిన కేఈ
అసెంబ్లీలోనే తన చేతిలో ఉన్న పేపర్లను కేఈ కృష్ణమూర్తి విసిరికొట్టారు. అసైన్‌మెంట్ కమిటీని ఎందుకు నియమించలేదని నలుగురు ఎమ్మెల్యేలు ఆయనను నిలదీశారు. దీంతో ఆయన తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు.

మూడున్నరేళ్లుగా లేదు
అనంతరం ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. అసైన్‌మెంట్ కమిటీలను ఎందుకు నియమించలేదో తెలియదని కేఈ అన్నారు. అసైన్‌మెంట్ కమిటీ వ్యవహారం ముఖ్యమంత్రి పరిధిలో ఉందని చెప్పారు. మూడున్నరేళ్లుగా దీనిని నియమించలేదన్నారు.

జన్మభూమిపై ప్రజల్లో అసంతృప్తి
జన్మభూమిపై ప్రజల్లో, ప్రతిపక్షంలో తీవ్ర అసంతృప్తి ఉందని కేఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. జన్మభూమి కమిటీలపై ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తోన్న విషయం తెలిసిందే. దీనిపై కేఈ ఇలా స్పందించడం గమనార్హం.

జగన్ వ్యాఖ్యల ఎఫెక్టా?
కాగా, అంతకుముందు రోజు కర్నూలులో జగన్ మాట్లాడుతూ.. కేఈని చూస్తుంటే జాలి కలుగుతోందని, పేరుకు మాత్రమే డిప్యూటీ సీఎం అని, కనీసం ఓ ఆర్డీవోను కూడా బదలీ చేయించలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. సీఎం తర్వాత స్థానంలో ఉండి కొడుమూరు-పత్తికొండ నియోజకవర్గాల మధ్య హంద్రీనీవా నదికి వంతెన నిర్మించలేకపోతున్నారన్నారు. ఈ వ్యాఖ్యల అనంతరం కేఈ అసెంబ్లీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం.












Click it and Unblock the Notifications