వారికి నోటీసుల షాక్: రెండేళ్ల పదవికి ఆశపడి శిల్పా ఆఫర్ మిస్ చేసుకున్నారా?

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డిపై టిడిపి కర్నూలు జిల్లా అధ్యక్షులు సోమిశెడ్డి వెంకటేశ్వర్లు తీవ్రంగా మండిపడ్డారు.

నంద్యాల: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డిపై టిడిపి కర్నూలు జిల్లా అధ్యక్షులు సోమిశెడ్డి వెంకటేశ్వర్లు తీవ్రంగా మండిపడ్డారు. శిల్పా మోహన్‌రెడ్డి ప్రలోభాలకు ఏ ఒక్కరు లొంగవద్దని హితవు పలికారు.

నంద్యాల ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఉప ఎన్నికలో టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డిని గెలిపించాలని, అభివృద్ధి సాధకులను ప్రోత్సహిస్తే వారు మరింత ఉత్సాహంగా ప్రగతి పథంలో ముందుకు వెళతారన్నారు.

శిల్పా వెంట వెళ్లి వారికి నోటీసుల షాక్

శిల్పా వెంట వెళ్లి వారికి నోటీసుల షాక్

నంద్యాల ప్రజలు అభివృద్ధికి ఓటు వేయాలని గత ముప్పై ఏళ్లలో చూడని అభివృద్ధిని తమ అభ్యర్థి చేసి చూపుతారని సోమిశెట్టి తెలిపారు. శిల్పా మోహన్ రెడ్డి ప్రలోభాలకు ఏ ఒక్కరు లొంగవద్దని, ఆయన వెంట వెళ్లిన కౌన్సిలర్లకు తాఖీదులు జారీ చేశామని, వారు తప్పు తెలుసుకుని సొంత గూటికి రావాలన్నారు.

రెండేళ్ల పదవికి ఆశపడి.. ఆ ప్రకటన విడ్డూరం

రెండేళ్ల పదవికి ఆశపడి.. ఆ ప్రకటన విడ్డూరం

రెండేళ్ల పదవికి ఆశపడి శిల్పా మోహన్ రెడ్డి పార్టీని వీడటం సబబు కాదని సోమిశెట్టి అన్నారు. భూమా నాగిరెడ్డి మృతితో ఖాళీ పడిన స్థానాన్ని వారి కుటుంబీకులకే కేటాయించటం ఆనవాయితీ అని, గతంలోను ఇదే సంప్రదాయాన్ని పాటించామని, ఇప్పుడు భూమా బ్రహ్మానంద రెడ్డిని వారి సొంత కుమారుడు కాదు కదా అని శిల్పా మోహన్ రెడ్డి ప్రశ్నించటం విడ్డూరమన్నారు. బ్రహ్మానంద రెడ్డి భూమా కుటుంబ సభ్యుడు కాదు కాబట్టి తాము పోటీ చేస్తున్నామని వైసిపి మెలిక పెట్టింది. దీంతో సోమిరెడ్డి పైవిధంగా స్పందించారు.

ఉమ్మడి కుటుంబంలో ఇలాగే.. లోకేష్ వస్తున్నారు..

ఉమ్మడి కుటుంబంలో ఇలాగే.. లోకేష్ వస్తున్నారు..

భూమా బ్రహ్మానంద రెడ్డి పోటీపై మాట్లాడుతూ.. ఉమ్మడి కుటుంబంలో బంధాలు ఇలాగే ఉంటాయని సోమిశెట్టి అన్నారు. జులై 6,7 తేదీల్లో మంత్రి నారా లోకేష్‌ జిల్లాకు రానున్నారని పార్టీ ప్రతినిధులతో సమీక్షతో పాటు, రెండు నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలతో ఆయన సమావేశం అవుతారని తెలిపారు.

శిల్పాకు ఆఫర్.. భూమా ఫ్యామిలీకి సీటు వదిలేస్తే ఎంపీ సీటు వచ్చేది

శిల్పాకు ఆఫర్.. భూమా ఫ్యామిలీకి సీటు వదిలేస్తే ఎంపీ సీటు వచ్చేది

మరో టిడిపి నేత కేఈ ప్రభాకర్‌ మాట్లాడుతూ... నంద్యాల ఉప ఎన్నికల్లో భూమా కుటుంబానికి సీటు వదిలి ఉంటే వచ్చే ఎన్నికల్లో శిల్పా మోహన్ రెడ్డికి నంద్యాల ఎంపీ సీటు వచ్చి ఉండేదని, ఓపిక పట్టలేక తొందరపడ్డారన్నారు. కాగా, జలదుర్గానికి చెందిన పలువురు కాపు నాయకులు టిడిపిలో చేరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+