ఆటగదా "శివ", ఒక్క నిర్ణయంతో - ఉండిలో సీన్ ఛేంజ్..!!

ఏపీలో ఎన్నికలు ముగిశాయి. కానీ, రాజకీయం ఉత్కంఠ కొనసాగుతోంది. గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తున్నా...లోలోపల మాత్రం ఆందోళన వెంటాడుతోంది. ఒక్క సారిగా ప్రధాన పార్టీల్లో సైలెన్స్ కనిపిస్తోంది. జూన్ 3న వచ్చే తుఫాను ముందు ప్రశాంతతలా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి కనిపిస్తున్న నియోజవర్గాల్లో ఉండి ఒకటి. ఇక్కడ రఘురామ పోటీలో ఉన్నారు. ఇక్కడ ఫలితం ఏంటి. రెబల్ శివరామరాజు కీలకంగా మారారు. అంచనాలు ఏంటి.

హోరా హోరీ పోరు
ఉండిలో చివరి నిమిషంలో టీడీపీ నుంచి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ పోటీ చేసారు. టీడీపీ నుంచి అప్పటికే టికెట్ ప్రకటించినప్పటికీ రామరాజు తప్పుకున్నారు. చంద్రబాబు సూచనలతో రఘురామకు సహకరించారు. వైసీపీ నుంచి పీవీఎల్ న‌ర‌సింహ‌రాజు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ సైతం వేగేశ్న వెంక‌ట గోపాల కృష్ణంరాజుకు టికెట్ ఇచ్చింది.

Keen contest on cards in Undi Assembly between Raghu Rama and YSRCP

గతంలో టీడీపీ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. 2019లో టీడీపీ ఎంపీ అభ్యర్దిగా రఘురామ చేతిలో ఓడిన కలువపూడి శివరామ రాజు ఫార్వర్డ్ పార్టీ అభ్యర్దిగా పోటీ చేసారు. ఇలా నలుగురు రాజులు పోటీలో నిలిచారు. అటు టీడీపీ, ఇటు వైసీపీల మ‌ధ్యే సాగుతుందని భావించినా..ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల మాదిరిగా ఇక్కడ అలాంటి ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. స్వతంత్ర అభ్యర్థిగా క‌లువ‌పూడి శివ కీలకంగా మారారు.

త్రిముఖ పోటీలో
ఆర్దికంగా వీరు బలవంతులు కావటంలో ఏ ఒక్కరూ తగ్గలేదు. పోలింగ్ రోజు సైతం ఎవరి ప్రయత్నాలు వారు కొనసాగించారు. ఇక్కడ శివరామ రాజుకు మంచి పట్టు ఉంది. గతంలో టీడీపీలో రెండు సార్లు గెలిచి ఉండటం..సీట రాలేదని సానుభూతి కలిసొచ్చే అంశాలు. టీడీపీ అభ్యర్ది రఘురామ కు పార్టీ ఓటింగ్ తో పాటుగా స్థానికంగా ఉన్న బలంతో గెలుస్తాననే ధీమాతో ఉన్నారు.

వైసీపీ అభ్యర్దికి స్థానికంగా ఉన్న గుర్తింపు.. పార్టీ ఓటింగ్..సంక్షేమ ఓట్ బ్యాంక కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే, ఉండిలో 2019లో 84.73 శాతం పోలింగ్ నమోదు కాగా, ఈ సారి 86.20 గా నమోదైంది. రఘురామ తో నరసింహరాజు, కలవపూడి శివ తల పడ్డారు. రఘురామ కు రావాల్సిన ఓట్లు కలవపూడి శివ చీల్చి ఉంటే నష్టం ఉండే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి.

ఫలితం పై ఉత్కంఠ
టీడీపీ ఓటింగ్ పూర్తిగా రఘురామకు పోలై ఉంటే కలిసి వస్తుందని భావిస్తున్నారు. అటు వైసీపీ అభ్యర్ది సైతం ఫార్వర్ద్ బ్లాక్ అభ్యర్ది చీల్చే ఓట్ల ఆధారంగానే ఆయన గెలుపు, ఓటములు ఆధారపడి ఉన్నాయి. అయితే, అసలు కలవపూడి శివ గెలుస్తారంటూ ఆయన మద్దతు దారులు ప్రచారం చేస్తున్నారు.

రఘురామ తాను గెలవటం ఖాయమని ధీమాగా ఉన్నారు. పోటీ చాలా బలంగా జరగటంతో గెలుపు, ఓటములను ఉండిలో ఈ సారి ఓటర్ల నాడి అంత సులువుగా చిక్కటం లేదని చెబుతున్నారు. దీంతో..ఇప్పుడు ఉండిలో జూన్ 4న వెల్లడయ్యే అధికారిక ఫలితం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+