కోట్లాది రూపాయల కేశవరెడ్డి విద్యాసంస్థల ఆస్తులు జప్తు
విజయవాడ: ఫీజులకు బదులుగా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి భారీగా డిపాజిట్లు వసూలు చేసి ఆతర్వాత వాటిని తిరిగి చెల్లించలేక చేతులెత్తేసిన కేశవరెడ్డి విద్యా సంస్థల ఆస్తులను ఏపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పరిధిలోని చిత్తూరు, కర్నూలు, అనంతపురం, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని రూ.12.81కోట్ల విలువైన 17.82ఎకరాల భూమిని జప్తు చేసింది.
హోంశాఖ ముఖ్య కార్యదర్శి అనూరాధ మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. కేశవరెడ్డి విద్యాసంస్థలు చేసిన మోసంపైన 2015 సెప్టెంబరులో కర్నూలు సహా పలు జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. వాటిన్నింటిని అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది.

దీనిపైన దర్యాప్తుచేపట్టిన సీఐడీఅధికారులు 10,806 మంది విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కేశవరెడ్డి విద్యాసంస్థల ప్రతినిధులు రూ.270 కోట్ల మేర డిపాజిట్లు వసూలు చేసినట్లు లెక్క తేల్చింది. పలువురు ఫైనాన్షియర్లు, బ్యాంకుల నుంచి మరో మరో రూ.277 కోట్లను పొందినట్లు తేల్చింది. ఆ సొమ్ముతో పలుచోట్ల స్థిరాస్తులు కూడబెట్టినట్లు గుర్తించింది.












Click it and Unblock the Notifications