‘జేసీ బ్రదర్స్ అండతోనే దీపక్ రెడ్డి భూకబ్జాలు’
అనంతపురం: తెలుగుదేశం పార్టీ నేతలు జేసీ బ్రదర్స్(జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి) అండతోనే టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి భూకబ్జాలకు పాల్పడ్డారని వైయస్సార్ కాంగ్రెస పార్టీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. సీబీఐ దాడుల అనంతరం ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిని టీడీపీ నుంచి సీఎం చంద్రబాబు సస్పెండ్ చేశారని.. దీపక్ రెడ్డి అరెస్టైనా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.

వాకాటికో న్యాయం, దీపక్ రెడ్డికి మరో న్యాయమా? అని నిలదీశారు. దీపక్ రెడ్డిపై తెలంగాణ ప్రభుత్వం 'సిట్'తో దర్యాప్తు చేయించాలని పెద్దారెడ్డి డిమాండ్ చేశారు. దీపక్ రెడ్డిపై ఎటువంటి చర్య తీసుకోకపోవడం చంద్రబాబు అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అన్నారు.
హైదరాబాద్ నడిబొడ్డుతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ వందల కోట్ల విలువైన స్థలాలను కబ్జా చేయడానికి కుట్ర పన్నారన్న ఆరోపణలతో దీపక్ రెడ్డిని హైదరాబాద్ సీసీఎస్(సీసీఎస్) అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications