Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చంద్రబాబుతో భేటీ అనంతరం వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైయస్ షర్మిల నేడు చంద్రబాబు నివాసంలో కలిశారు. గతంలో వైఎస్సార్ హయాంలో వైయస్సార్ కు ప్రత్యర్థిగా ఉన్న చంద్రబాబు, ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యర్థిగా ఉండడంతో అప్పట్లో ఎన్నికల సమయంలో విరుచుకుపడిన వైఎస్ షర్మిల, బైబై బాబు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.

Recommended Video

    Chandrababu ని అందుకే కలిశాను Sharmila Meets Chandrababu| Oneindia Telugu

    షర్మిల నేడు చంద్రబాబు ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి హాజరు కావాలని వైయస్ షర్మిల ఆహ్వానించారు. ఇక వీరిద్దరి భేటీ రాజకీయ వర్గాలలోను, ప్రజలలోను ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న క్రమంలో వైయస్ షర్మిల భేటీ ఉత్కంఠను కలిగించింది. వైయస్ షర్మిల స్వయంగా చంద్రబాబును ఆయన సతీమణి భువనేశ్వరి కుమారుడు లోకేష్ ను రాజారెడ్డి వివాహానికి ఆహ్వానించారు.

    Key comments of YS Sharmila after the meeting with Chandrababu

    అనంతరం మీడియాతో మాట్లాడిన షర్మిల ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడి వివాహానికి రావాలని ఆహ్వానించాను అని తెలిపారు . ప్రతి విషయాన్ని రాజకీయాలతో ముడిపెట్టొద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో వివాహానికి చంద్రబాబు వస్తానని చెప్పారని చంద్రబాబు గారితో భేటీలో వైఎస్సార్ తో తనకున్న అనుబంధాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారని వైయస్ షర్మిల పేర్కొన్నారు.

    ఏపీ ఎన్నికలలో కాంగ్రెస్ ఏ బాధ్యత అప్పగించినా, తాను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని వైయస్ షర్మిల స్పష్టం చేశారు. కావాలని ప్రతీది రాజకీయం చేస్తున్నారని పేర్కొన్న షర్మిల క్రిస్మస్ పండుగ సందర్భంగా చంద్రబాబుకు, లోకేష్ కు స్వీట్లు పంపామని, కేటీఆర్ కు, కవితకు, హరీష్ రావుకు కూడా స్వీట్లు పంపామని చెప్పుకొచ్చారు. ప్రతి విషయాన్ని రాజకీయాలతో ముడిపెట్టొద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.

    చంద్రబాబుకు తనకు ఎటువంటి రాజకీయ సంబంధాలు లేవని చెప్పిన షర్మిల ఎవరు ఏ పార్టీలో ఉన్నా ప్రజల సేవ చేయడం కోసమే ఉన్నామని చెప్పారు. తామంతా ప్రజల కోసమే ఉన్నామని చెప్పడం ద్వారా ఆమె టిడిపితో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నారన్న సంకేతాలు ఇచ్చారని కొందరు భావిస్తున్నారు. ఏది ఏమైనా వైయస్ షర్మిల చంద్రబాబుతో భేటీ ఇప్పుడు ఏపీ రాజకీయాలలో కీలక మార్పులకు సంకేతంగా చెప్పొచ్చని అంచనా వేస్తున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+