లోకసభ ఘటనపై కిరణ్:'సీమాంధ్ర ఎంపీలపై నేతల దాడి'

హైదరాబాద్/న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యంలో ఎటువంటి సమస్యల పైన అయినా చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురువారం హైదరాబాదులో అన్నారు. పార్లమెంటులో జరిగిన ఘటనపై ఆయన పై విధంగా స్పందించారు. లోకసభలో ఈ రోజు జరిగిన ఘటన బాధాకరమైనదన్నారు.

సీమాంధ్ర ఎంపీలపై దాడి చేశారు: మోదుగుల

సభలో తమ పైన తెలంగాణ ప్రాంత, ఇతర ఎంపీలు దాడి చేశారని మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆరోపించారు. తనపై దాడి చేసింది రాజ్ బబ్బర్, అంజన్ కుమార్ యాదవ్‌లని మోదుగుల చెప్పారు. మార్షల్స్‌కు బదులు కాంగ్రెస్ ఎంపీలే తనపై దాడి చేశారన్నారు. చివరకి మార్షల్స్‌తో కూడా దాడి చేయించారన్నారు. కాగా, లగడపాటి, మోదుగుల వంటి వారిపై పలువురు ఎంపీలు మొదటగా దాడి చేసినట్లు చెబుతున్నారు.

Kiran Kumar Reddy

సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్

లోకసభలో సీమాంధ్ర పార్లమెంటు సభ్యులను సస్పెన్షన్ చేస్తున్నట్లు స్పీకర్ మీరా కుమార్ ప్రకటించారు. రెండు గంటలకు సభ ప్రారంభమైన వెంటనే ఆమె వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. అనంతరం సభను మూడుగంటలకు వాయిదా వేశారు. రాజ్యసభలోను ఎంపీలు వెల్లోకి దూసుకెళ్లి ఆందోళన వ్యక్తం చేశారు.

పార్లమెంటులో కాంగ్రెసు పార్టీ తీరు విచారకరమని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత బిజెపి సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ అన్నారు. కాంగ్రెసు సభ్యులు, మంత్రులు వారిలో వారే గొడవ బెట్టుకుంటు సమావేశాలకు అడ్డు తగులుతున్నారని ఆరోపించారు. ఈ ఘటన దురదృష్టకరమని రామ్ విలాస్ పాశ్వాన్, శరద్ యాదవ్‌లు అన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. మరోవైపు సస్పెన్షన్‌కు గురైన ఎంపీలో సభలో గందరగోళం చేశారని దిగ్విజయ్ సింగ్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+